ITI Jobs: NPCIL అప్రెంటీస్ ఖాళీలు భర్తీ

ITI Jobs: NPCIL అప్రెంటీస్ ఖాళీలు భర్తీ

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్​పీసీఐఎల్) అప్రెంటీస్ ఖాళీల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది.  ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 21.

పోస్టుల సంఖ్య: 337
పోస్టులు: ట్రేడ్ అప్రెంటీస్ 122, డిప్లొమా అప్రెంటీస్ 94, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ 121.
ఎలిజిబిలిటీ: ట్రేడ్ అప్రెంటీసుకు సంబంధిత ట్రేడులో ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 
డిప్లొమా అప్రెంటీసుకు సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. గ్రాడ్యుయేట్ అప్రెంటీసుకు ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీలో డిగ్రీ లేదా బీఏ, బీఎస్సీ, బీకాం పూర్తి చేసిన వారు కూడా అప్లై చేయవచ్చు.
వయోపరిమితి: ట్రేడ్ అప్రెంటీసుకు 14 ఏండ్ల నుంచి 24 ఏండ్ల మధ్యలో ఉండాలి. డిప్లొమా అప్రెంటీసుకు 18 ఏండ్ల నుంచి 25 ఏండ్ల మధ్యలో ఉండాలి. గ్రాడ్యుయేట్ అప్రెంటీసుకు 20 ఏండ్ల నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉండాలి. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: జూన్ 20.
లాస్ట్ డేట్: జులై 21. 
సెలెక్షన్ ప్రాసెస్: ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్​లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. 
పూర్తి వివరాలకు npcil.nic.in వెబ్​సైట్​లో చూడగలరు.