నిర్బంధాన్ని నిరసిస్తూ ఎన్ఎస్ యూఐ ఆందోళన

నిర్బంధాన్ని నిరసిస్తూ ఎన్ఎస్ యూఐ ఆందోళన

పంజాగుట్ట, వెలుగు : రాహుల్, ప్రియాంక గాంధీల నిర్బంధాన్ని నిరసిస్తూ కేంద్ర మంత్రి అమిత్ షా, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఎన్​ఎస్​యూఐ ఆధ్వర్యంలో బుధవారం మైత్రీవనం చౌరస్తాలో ఆందోళన నిర్వహించారు. అమిత్​ షా, జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర అధ్య క్షుడు యడవల్లి వెంకటస్వామి మాట్లాడుతూ అన్యాయపు పాలన ఇంకెంతో కాలం ఉం డదని, త్వరలోనే దేశ ప్రజలు బీజేపీ పాలనకు చరమగీతం పాడుతారని హెచ్చరించారు.