నీట్ అవకతవకలపై దిద్దుబాటు చర్యలు.. ఎన్టీఏ డీజీపై వేటు

 నీట్ అవకతవకలపై దిద్దుబాటు చర్యలు.. ఎన్టీఏ డీజీపై వేటు

నీట్ అవకతవకలపై దిద్దుబాటు చర్యలు చేపట్టింది కేంద్రం. ఇందులో భాగంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డీజీ సుబోధ్ కుమార్ సింగ్ పై వేటు పడింది. యూజీసీ నీట్, నెట్ ఎగ్జామ్స్ లీకేజీ ఆరోపణలతో పదవి నుంచి తొలగించింది కేంద్రం. ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ ఎండిగా ఉన్న కేరళ క్యాడర్ రిటైర్డ్ ఐఏస్ అధికారి ప్రదీప్ సింగ్ ఖరోలాకు అదనపు బాధ్యతలు అప్పగించింది. 

UGC నీట్, నెట్ పరీక్షల లీకేజీపై ఆందోళనలతో.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో సంస్కరణలకు హైలెవల్ కమిటీ ఏర్పాటు చేసింది కేంద్ర విద్యాశాఖ. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఏడుగురు సభ్యులుండే ఈ కమిటీకి ఇస్రో మాజీ ఛైర్మన్ కె.రాధాకృష్ణన్ ను అధ్యక్షుడిగా నియమించింది.  సంస్కరణలు, డేటా సెక్యూరిటీ, ఎన్టీయే పనితీరు మెరుగుపరిచేందుకు సూచనలు ఇవ్వనుంది ఈ కమిటీ.  2 నెలల్లో కమిటీ తన నివేదికను కేంద్రానికి ఇవ్వాల్సి ఉంటుంది.