
వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జూన్ 9.
పోస్టుల సంఖ్య: 120
పోస్టులు: డిప్యూటీ మేనేజర్(ఎలక్ట్రికల్) 40, డిప్యూటీ మేనేజర్ (మెకానికల్) 40, డిప్యూటీ మేనేజర్ (సీ అండ్ ఐ) 40.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో బీటెక్ లేదా బీఈ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత ఫీల్డ్‌లో కనీసం 10 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 40 సంవత్సరాలు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: మే 26.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.300.
లాస్ట్ డేట్: జూన్ 09.
పూర్తి వివరాలకు www.ntpc.co.in వెబ్ సైట్ లో సంప్రదించగలరు.