జ్యోతినగర్,వెలుగు: ఇటీవల విడుదలైన యూపీఎస్‌సీ ఫలితాల్లో ఎన్టీపీసీ యువకుడు సత్తాచాటాడు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ ఏరియాకు చెందిన దహగామ శశాంక్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ లో జాతీయ స్థాయిలో 78వ ర్యాంక్, స్టేట్‌లో ఫస్ట్ ర్యాంకు సాధించాడు. శశాంక్ జేఎన్టీయూ హైదరాబాద్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో ఎంటెక్ పూర్తి చేశాడు.
2024 లా సెట్ లో 32వ ర్యాంకు సాధించి ప్రస్తుతం ఓయూలో ఎల్‌ఎల్‌బీ చదువుతున్నాడు. ఐఏఎస్ లక్ష్యంగా ప్రిపేర్ అయిన అతను.. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ సాధించాడు. తండ్రి ఉమామహేశ్వర్, పర్యావరణ వేత్త, తల్లి నాగలక్ష్మి అడ్వకేట్‌గా పనిచేస్తున్నారు.
