గాంధీలో ఎన్టీపీసీ స్వచ్ఛతాహీ సేవా

గాంధీలో ఎన్టీపీసీ స్వచ్ఛతాహీ సేవా

పద్మారావునగర్, వెలుగు: ఎన్టీపీసీ సౌత్ ​రీజియన్​హెడ్ క్వార్టర్ ఆధ్వర్యంలో గురువారం స్వచ్ఛతాహీ సేవా నిర్వహించారు. సికింద్రాబాద్​ఎన్టీపీసీ ఆఫీస్​నుంచి గాంధీ ఆసుపత్రి వరకు అవగాహన ర్యాలీ తీశారు. 

గాంధీ ఆసుపత్రి ఆవరణలో శ్రమదానం చేశారు. ఎన్టీపీసీ తరపున గాంధీ ఆసుపత్రికి డస్ట్ బిన్లు అందచేశారు. ఎన్టీపీసీ జీఎం ఎస్.ఎన్.పాణిగ్రాహి, రోహిత్​చాబ్రా, సురేశ్,​వెంకటేశ్, డీఎంఈ డా.ఎన్.వాణి,  గాంధీ సూపరింటెండెంట్​ప్రొ.రాజకుమారి, డిప్యూటీ సూపరింటెండెంట్​డాక్టర్ జీకే సునీల్ పాల్గొన్నారు.