
యంగ్ టైగర్ ‘జూనియర్ ఎన్టీఆర్’ కొత్త సినిమా ప్రారంభమౌతుందా ? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అనంతరం తదుపరి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టార్ డైరెక్టర్ ‘కొరటాల శివ’తో ఓ సినిమాకు ఎన్టీఆర్ ఒకే చెప్పారు. కానీ.. ఇప్పటిదాక దీనికి సంబంధించిన విషయాలు బయటకు రాలేదు. RRR సినిమా వచ్చి 9 నెలలు అయిపోయింది. ఆయన సినిమాలకు సంబంధించి అప్ డేట్ రాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. కొరటాల డైరెక్షన్ లో NTR 30 సినిమా చేయబోతున్నట్లు పోస్టర్, వాయిస్ రిలీజ్ చేసి చాలా రోజులవుతోంది. లేటెస్ట్ గా దీనికి సంబంధించి ఎన్టీఆర్ ఆర్ట్స్ ఓ అప్ డేట్ ఇచ్చింది. న్యూ ఇయర్ సందర్భంగా సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు.
2024 ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అలాగే ఫిబ్రవరి నుంచి షూటింగ్ మొదలుపెట్టనున్నారు. అనిరుధ్ సంగీతం అందించనున్నాడు. ఎన్నో రోజులుగా ఎన్టీఆర్ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు జోష్ ఇచ్చినట్లైంది. ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తారనేది తెలియడం లేదు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ పతాకాలపై నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుంది. గతంలో జూ.ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో ‘జనతా గ్యారేజ్’ సినిమా వచ్చింది. ఈ మూవీ సూపర్ హిట్అయ్యింది. మళ్లీ ఇదే కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతుండడంతో అటు నందమూరి అభిమానులు ఇటు జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు.