NTR 31 పవర్ ఫుల్ టైటిల్

NTR 31 పవర్ ఫుల్ టైటిల్

క్లాస్, మాస్ అనే తేడా లేదు. క్యారెక్టర్ ఏదైనా తనదైన శైలిలో పండించడం ఎన్టీఆర్ స్టైల్. నెగిటివ్ షేడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని కూడా అద్భుతంగా చూపించగలడని ‘జై లవకుశ’ సినిమా ప్రూవ్ చేసింది. ఇప్పుడు మరోసారి తారక్ గ్రే షేడ్ ఉన్న క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపించడానికి రెడీ అవుతున్నాడనే ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎన్టీఆర్ ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది తనకి ముప్ఫై ఒకటో సినిమా. ఇటీవలే అఫీషియల్ అనౌన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ వచ్చింది. ఆ సందర్భంగా తన లుక్ కూడా రివీలయ్యింది. అందులో చాలా సీరియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, చెప్పాలంటే కాస్త క్రూయెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తున్నాడు తారక్.

దాంతో అప్పటి నుంచి ఇందులో అతను నెగిటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టచ్ ఉన్న పాత్ర చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఓ టైటిల్ కూడా బైటికి వచ్చింది. పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైటిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎంచుకునే ప్రశాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఈ చిత్రానికి ‘అసుర’ అని కానీ, ‘అసురుడు’ అని కానీ పెట్టాలనుకుంటున్నాడట. అదే నిజమైతే ఇంతవరకు వచ్చిన వార్తలు నిజమయ్యే అవకాశం ఉంది.  అయితే ఈ టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గతంలో నారా రోహిత్ కూడా ఓ సినిమా చేశాడు. కాబట్టి టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని రిపీట్ చేస్తారా లేక ఇదే ఫిక్సా అనేది అఫీషియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కన్ఫర్మేషన్ వస్తే కానీ తెలీదు. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే యేడు ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్టార్ట్ కానుంది. ఈలోపు కొరటాల శివతో సినిమాని పూర్తి చేయనున్నాడు తారక్.

మరిన్ని వార్తల కోసం : -
పట్టాలెక్కిన పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్టు


అంటే సుందరానికి డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఇంటర్వ్యూ