సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన చిత్రం ‘సింగ్ గీతం’. జూన్ 12న విడుదలైన ఈ చిత్రంపై సగటు ప్రేక్షకులతోపాటు పలువురు సినీ ప్రముఖులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. రీసెంట్‌గా నిర్వహించిన సక్సెస్ మీట్‌లో అనిల్ రావిపూడి పాల్గొని.. సింగీతం గారి నుంచి వచ్చిన మరో ల్యాండ్ మార్క్ మూవీ అని చెప్పాడు.
ఈ చిత్రాన్ని చూసిన హీరో ఎన్టీఆర్.. ‘సింగ్ గీతం’ హృదయాన్ని తాకే అద్భుతమైన సినిమా అని, తరతరాల సినీ అభిమానులకు సింగీతం గారు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారని ట్వీట్ చేశాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించిన నాగ్ అశ్విన్.. ప్రేక్షకుల రెస్పాన్స్ చాలా సంతోషంగా ఉందన్నాడు.
ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, నటులు రాహుల్ రవీంద్రన్, నివేదా పేతురాజ్, అహల్య, అయాన్, శాలిని, బెనర్జీ, శివన్నారాయణ పాల్గొని ఈ సక్సెస్‌లో భాగమవడం ఆనందంగా ఉందన్నారు.
