రెండు లక్షల ఇండియన్స్ అమెరికా ఫ్లైట్ ఎక్కారట

రెండు లక్షల ఇండియన్స్ అమెరికా ఫ్లైట్ ఎక్కారట

చదువుకైనా, ఉద్యోగానికైనా.. అమెరికా అంటేనే యమా క్రేజ్. అందుకే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లోని స్టూడెంట్లు ఎక్కువగా అమెరికాకే క్యూ కడుతుంటారు. ఇక మనోళ్ల సంగతి అయితే చెప్పనవసరం లేదు. ఫారిన్ స్టడీ అనగానే.. మన స్టూడెంట్స్ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది యూఎస్ కే. మన దేశం నుంచి 2018–19లో దాదాపు 2.02 లక్షలకు పైనే స్టూడెంట్లు అమెరికా ఫ్లైట్ ఎక్కేశారట. అయితే, ఈ విషయంలో చైనా వరుసగా పదో సంవత్సరం టాప్​లో నిలిచిందట.  సోమవారం యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్​ కామర్స్ విడుదల చేసిన ‘2019 ఓపెన్ డోర్స్ రిపోర్ట్ ఆన్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ ఎక్స్​చేంజ్’ నివేదిక వెల్లడించింది. అమెరికాకు 2018-19లో ఇంటర్నేషనల్​ స్టూడెంట్ల సంఖ్య ఆల్ టైం రికార్డ్ స్థాయిలో పెరిగిందని తెలిపింది. వరుసగా నాలుగో ఏడాది10 లక్షలకు పైగా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వచ్చారని పేర్కొంది.

చైనా టాప్,. ఇండియా సెకండ్…

అమెరికాకు వచ్చే ఇంటర్నేషనల్ స్టూడెంట్ల సంఖ్యలో చైనా వరుసగా పదో ఏడాది టాప్ లో నిలిచింది. ఆ దేశం నుంచి 2018––19లో మొత్తం 3,69,548 మంది స్టూడెంట్లు అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, నాన్ డిగ్రీ, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్ వంటి ప్రోగ్రాంలలో చేరారు. ఆ తర్వాత ఇండియా నుంచి 2,02,014 మంది స్టూడెంట్లు వెళ్లారు. ఇండియన్ స్టూడెంట్ల సంఖ్య గత ఏడాది 2.9 శాతం పెరిగింది. గత ఏడాది మొత్తం10,95,299 మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్లు అమెరికాకు వచ్చారని నివేదిక వెల్లడించింది. వీరి సంఖ్య గతేడాది 0.05 శాతం పెరిగిందని తెలిపింది. అమెరికాలో హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుతున్న మొత్తం స్టూడెంట్లలో విదేశీయులే 5.5 శాతం ఉన్నట్లు పేర్కొంది. మొత్తం ఫారిన్ స్టూడెంట్లలో సగం మంది చైనా, ఇండియా వాళ్లే ఉన్నారని తెలిపింది. ఇండియా తర్వాత సౌత్ కొరియా నుంచి ఎక్కువగా 52,250 మంది స్టూడెంట్లు అమెరికా వచ్చినట్లు పేర్కొంది.

అమెరికా ఎకానమీకి రూ. 3 లక్షల కోట్లు..

అన్ని దేశాల నుంచి గత ఏడాది అమెరికాలో చదువు కోసం వచ్చిన ఇంటర్నేషనల్ స్టూడెంట్ల వల్ల అమెరికా ఖజానాకు భారీగా లాభం జరిగిందని అమెరికా కామర్స్ డిపార్ట్ మెంట్ నివేదికలో తెలిపింది. వీరి వల్ల మొత్తంగా 44.7 బిలియన్ డాలర్లు అంటే.. దాదాపు రూ. 3.20 లక్షల కోట్లు అమెరికా ఎకానమీలో చేరాయని పేర్కొంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే వీరి కంట్రిబ్యూషన్ 5.5 శాతం పెరిగిందని తెలిపింది.

యూరప్​కు అమెరికా స్టూడెంట్ల క్యూ 

ఎక్కువ దేశాల స్టూడెంట్లు అమెరికాకు వెళుతుంటే.. అమెరికా స్టూడెంట్లు మాత్రం యూరప్ దేశాలకు క్యూ కడుతున్నారట! గత ఏడాది యూఎస్ నుంచి మొత్తం 3,41,751 మంది అమెరికన్ స్టూడెంట్లు విదేశాల్లో చదివేందుకు వెళ్లారట. అయితే అమెరికా నుంచి విదేశాల్లో చదువుల కోసం వెళ్లే స్టూడెంట్లలో 54.9 శాతం మంది యూరప్ కంట్రీస్​కే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారని రిపోర్ట్ తెలిపింది. యూఎస్ స్టూడెంట్‌‌లు ఎక్కువగా బ్రిటన్​, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలకు వెళుతున్నారని తెలిపింది.

కుర్​కురే మిల్క్​షేక్

స్వీట్​ మ్యాగీ గుర్తుందా? పోనీ.. చాక్లెట్​చెర్రీ దోశె..! ఓకే.. ఇప్పుడు ఆ వింత వంటల జాబితాలోనే చేరబోతోందీ కుర్​కురే మిల్క్​షేక్​!! సాహిల్​ అధికారి అనే ఓ ట్విట్టర్​ యూజర్​ పాలల్లో కుర్​కురే చిప్స్​ కలిపి కుర్​కురే మిల్క్​ షేక్​చేశాడట. దాని ఫొటోను ట్విట్టర్​లో పెట్టడంతో అది వైరల్​ అయింది. స్వీట్​ మ్యాగీ, చాక్లెట్​ చెర్రీ దోశెలను మించి వైరల్​ అవుతోంది. కొందరు ఆ వింత డ్రింక్​ను చూసి వామ్మో ఇదెక్కడి డ్రింక్​రా బాబూ అంటుంటే, మరికొందరు నెటిజన్లు మాత్రం సూపర్​ ఐడియా అంటూ మెచ్చుకుంటున్నారు. మరి, ఈ కొత్త డ్రింక్​పై మీ ఒపీనియన్​ ఏంటి?