
- అన్ని ఫార్మాట్లలో టాప్ ప్లేస్
దుబాయ్: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా తిరిగి అన్ని ఫార్మాట్లలో నంబర్ వన్ ర్యాంక్‌లోకి వచ్చింది. ఆదివారం విడుదలైన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో ఇండియా 122 రేటింగ్ పాయింట్లతో టాప్ ప్లేస్‌లోకి దూసుకొచ్చింది. ఇప్పటి వరకు టాప్‌లో ఉన్న ఆస్ట్రేలియా (117) రెండో ర్యాంక్‌కు పడింది. సెప్టెంబర్ 2023 నుంచి జనవరి 2024 వరకు టెస్ట్‌ల్లో నంబర్‌వన్‌లో ఉన్న టీమిండియా..
సౌతాఫ్రికాతో సిరీస్‌ను డ్రా చేసుకోవడంతో రెండో ర్యాంక్‌కు పడిపోయింది. కానీ ఇంగ్లండ్‌పై 4–1తో సిరీస్ గెలిచిన ఇండియా మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. ఇప్పటికే ఇండియా వన్డే (121), టీ20 (266)ల్లో నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగుతున్నది. ఇక డబ్ల్యూటీసీలోనూ ఇండియా 68.51 పాయింట్స్ పర్సంటేజ్‌తో టాప్‌లో ఉంది.