గాంధీలో సమ్మె విరమించిన నర్సులు.. నేటి నుంచి డ్యూటీలకు హాజరు

గాంధీలో సమ్మె విరమించిన నర్సులు.. నేటి నుంచి డ్యూటీలకు హాజరు

పద్మారావునగర్, వెలుగు: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గాంధీ ఆస్పత్రిలో ఔట్​ సోర్సింగ్, కాంట్రాక్ట్​ నర్సులు 17 రోజులుగా  చేస్తున్న సమ్మెను మంగళవారం విరమించారు. బుధవారం నుంచి విధులకు హాజరవుతామని నర్సులు తెలిపారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్​అమలులో ఉన్నందున సమ్మె విరమిస్తామని, డ్యూటీలు చేస్తూనే వివిధ రూపాల్లో తమ జీతాలు పెరిగే వరకు నిరసనలు చేస్తామని నర్సులు పేర్కొన్నారు.  
మంగళవారం వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, ఆస్పత్రి సూపరింటెండెంట్​తో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసుఫ్, ఉప ప్రధాన కార్యదర్శి ఎం.నర్సింహా, కార్యదర్శి ప్రసాద్​చర్చలు జరిపారు. ఎన్నికల కోడ్ ​కారణంగా సమ్మెను విరమిస్తున్నట్లు ఏఐటీయూసీ నేతలు ప్రకటించారు. తమ సమస్యలపై  నర్సుల యూనియన్​ నేతలు ఇందిరా, సబిత, సుందరమ్మ, నాగమణి..  అధికారులకు వినతిపత్రం అందించారు.