శిరోముండ‌నం కేసులో నూత‌న్ నాయుడు అరెస్ట్

శిరోముండ‌నం కేసులో నూత‌న్ నాయుడు అరెస్ట్

విశాఖలోని పెందుర్తిలో దళిత యువకుడు కర్రి శ్రీకాంత్ శిరోముండనం ఘటనలో కేసులో నిర్మాత, నటుడు, బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. సంఘటన జరిగిన తర్వాత నూతన్ నాయుడు ఉడిపికి వెళ్లిపోయారు. దీంతో విశాఖ నుంచి ఉడిపి వెళ్లిన పోలీసులు నూతన్ నాయుడిని అదుపులకి తీసుకున్నారు. అక్కడి నుంచి విశాఖకు తీసుకొస్తున్నట్లు సీపీ మనీష్‌కుమార్ సిన్హా తెలిపారు.

శిరోముండనం నూతన్ నాయుడు సమక్షంలోనే జరిగినట్లు నిర్దారణైందని సిపి చెప్పారు. దీంతో అతడిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ ఘటన జరిగిన 24 గంటల్లోనే నూతన్ నాయుడు భార్య మధుప్రియ తో పాటు ఇందిరా, ఝాన్సీ, సౌజన్య, రవి, బాలు, వరహాలు మీద కేసు నమోదు అయ్యాయి. సెక్షన్ 307, 342, 324, 323, 506, ఆర్‌డబ్ల్యూ 34 ఐపీసీ 3(1)(ఈ),3(2)(వీ), ఎస్సీ, ఎస్టీ, పీఓఏ యాక్ట్ చట్టం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.