ఎన్నికల ప్రచారానికి కేంద్ర మంత్రులు వస్తున్నరు : ఎన్‌‌వీ సుభాష్

ఎన్నికల ప్రచారానికి కేంద్ర మంత్రులు వస్తున్నరు : ఎన్‌‌వీ సుభాష్

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని బీజేపీ అధికార ప్రతినిధి ఎన్‌‌వీ సుభాష్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రానికి పలువురు కేంద్ర మంత్రులు వస్తున్నారని చెప్పారు. సోమాజిగూడలోని బీజేపీ మీడియా సెంటర్​లో గురువారం ఆయన మాట్లాడారు.  

మునుగోడు, పాలకుర్తి అసెంబ్లీ స్థానాలలో ప్రచారానికి అనురాగ్ ఠాకూర్, వరంగల్ ఈస్ట్ వెస్ట్ అసెంబ్లీ స్థానాల పరిధిలో ప్రచారం చేయడానికి అశ్విని కుమార్ చౌబే వస్తారని వెల్లడించారు. ఈ నెల 11న సికింద్రాబాద్​లో ప్రధాని మోదీ సభకు అటెండ్ అవుతున్నారన్నారు.  ఈ నెల 27 వరకు కేంద్ర మంత్రులు వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారని చెప్పారు.