అట్లయితే న్యూయార్క్ ముంబైలా మారుతది..స్టార్‌‌‌‌వుడ్ క్యాపిటల్ గ్రూప్ సీఈవో

అట్లయితే న్యూయార్క్ ముంబైలా మారుతది..స్టార్‌‌‌‌వుడ్ క్యాపిటల్ గ్రూప్ సీఈవో
  • మమ్దానీ హౌసింగ్ పాలసీపై బారీ స్టార్న్‌‌లిచ్ విమర్శలు

న్యూయార్క్: న్యూయార్క్ కొత్త మేయర్ జొహ్రాన్ మమ్దానీపై రియల్ ఎస్టేట్ కంపెనీ స్టార్‌‌‌‌వుడ్ క్యాపిటల్ గ్రూప్ సీఈవో బారీ స్టార్న్‌‌లిచ్ విమర్శలు చేశారు. న్యూయార్క్‌‌లో అద్దెలను నియంత్రించడంతో పాటు కొన్నేండ్ల పాటు పెంచకుండా ఫ్రీజ్ చేస్తానని ఎన్నికల టైమ్‌‌లో మమ్దానీ హామీ ఇచ్చారు. దీనిపై బుధవారం మీడియాతో బారీ స్టార్న్‌‌లిచ్ మాట్లాడుతూ.. మమ్దానీ హౌసింగ్ పాలసీ కారణంగా న్యూయార్క్‌‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్ దెబ్బతింటుందని అన్నారు. 

‘‘న్యూయార్క్‌‌లో ప్రజలకు సరిపడా ఇండ్లు అందుబాటులో లేవు. అసలు సమస్య అదే. మమ్దానీ ఇండ్లను పెంచడంపై దృష్టి పెట్టకుండా, అద్దెలను తగ్గిస్తానని చెబుతున్నారు. అట్లయితే అద్దెదారులు రెంట్ ఇవ్వరు. ఒకరిని చూసి ఒకరు అలానే చేస్తారు. అప్పుడు న్యూయార్క్ నగరం కాస్తా ముంబైలా మారుతుంది” అని వ్యాఖ్యానించారు.