నైసస్ ఫైనాన్స్ రికార్డు వృద్ధి

నైసస్ ఫైనాన్స్ రికార్డు వృద్ధి

హైదరాబాద్, వెలుగు: ఆల్టర్నేటివ్స్​ఇన్వెస్ట్మెంట్స్ ​కంపెనీ నైసస్ ఫైనాన్స్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ 2026 ఆర్థిక సంవత్సర ఫలితాలను విడుదల చేసింది. సంస్థ కోర్ బిజినెస్ ఆదాయం 110 శాతం వృద్ధితో రూ.141.07 కోట్లకు చేరింది. నికర లాభం 108 శాతం పెరిగి రూ.67.76 కోట్లుగా నమోదైంది. నిర్వహణ లాభం రూ.96.5 కోట్లు ఉంది.

సంస్థ నిర్వహణలోని ఆస్తుల (ఏయూఎం) విలువ 67 శాతం పెరిగి రూ.2,631 కోట్లకు చేరుకుంది. భారతదేశంతో పాటు దుబాయ్​లో పెట్టుబడుల వల్లే ఈ వృద్ధి సాధ్యమైంది. నూతన కన్సాలిడేటెడ్ కన్‌‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ విలీనంతో కలిపి సంస్థ మొత్తం ఆదాయం రూ.574.92 కోట్లుగా, లాభం రూ.83.08 కోట్లుగా నమోదైంది.