బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటి ప్రభుత్వం ఏర్పాటు దిశగా సాగుతోంది.. ఎన్డీయే కూటమి 190 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.. ప్రభుత్వం ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 122 మాత్రమే.. అయితే ఇంతలా ఎన్డీయే కూటమి విజయానికి ప్రముఖ యువ సింగర్, బీజేపీ అభ్యర్థి మైథిలీ ఠాకూర్పాట ఓ రాజాజీ కూడా ఓ ప్రధానం కారణంగా చెప్పొచ్చు. ప్రచార సమయంలో ఆమె పాట బిహార్ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లను ఆకర్షించింది.బిహార్ రాజకీయాల్లో అందరి దృష్టిని ఆకర్షించిన పేరు మైథిలీ ఠాకూర్.
అద్భుతమైన గానంతో లక్షల మంది అభిమానులను సంపాదించిన మైథిలీ .. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలుపు దాదాపు ఖాయం చేసుకుంది. ఆమె గెలిస్తే దేశంలోనే అతిచిన్న వయస్సు గల ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించనుంది. “ఏ రాజా జీ” పాటతో ఎన్నికల సమయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాట నితీష్ కుమార్ నాయకత్వాన్ని ముందుంచడంతో, తిరిగి పట్టం కట్టడంలో కీలకంగా నిలిచింది. మైథిలీ పాట అప్పట్లో బాగా వైరల్అయింది.
మైథిలీ ఠాకూర్ గానం చేసిన ఈ పాట ప్రజల్లో మంచి ఆదరణ పొందగా.. అదే ఊపుతో ఆమె రాజకీయ ప్రవేశానికి కొత్త దారులు తెరిచింది. ప్రాంతీయ ప్రజల మద్దతు, సింగర్ గా ఆమె గుర్తింపు యూత్ లో ఉన్న అభిమనాంతో అలీనగర్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించబోతోంది. మైథిలీ తాను గెలిస్తే అలీనగర్ నియోజకవర్గం పేరును మారుస్తానని హామీ ఇచ్చింది కూడా.
