
లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో నిరూపించుకొని.. వెండితెరపై అద్భుతమైన నటనను కనబరుస్తున్న నటి నయనతార గురించి ఎంత చెప్పినా తక్కువే. అనామిక, కర్తవ్యం సినిమాల తర్వాత మళ్లీ అదే తరహాలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు నయనతార. జీఎస్ వెంకటేశ్ దర్శకత్వం వహించిన ఓ2 చిత్రం సస్పెన్స్ అండ్ ఇంట్రెస్టింగ్ కథాంశంతో సినీ అభిమానులు మెప్పించేందుకు రెడీ అయింది. గతంలో ఈ సినిమాకు సంబంధించి ఓ టీజర్ రిలీజ్ కాగా... ప్రస్తుతం ట్రైలర్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్. ఆద్యంతం ఆసక్తిగా, ఉత్కంఠ భరితంగా సాగే ఈ చిత్రం ఇప్పటికే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ను బట్టి చూస్తే.. ఈ మూవీపై అంచనాలు ఇంకా పెరిగేటట్టు తెలుస్తోంది. ఇంకో ముఖ్య విషయమేమిటంటే ఈ చిత్రాన్ని థియేటర్లలో కాకుండా.. డైరెక్టుగా ఓటీటీలోనే రిలీజ్ కానుందట. డిస్నీ ప్లస్ లో జూన్ 17న నేరుగా విడుదల కానున్న ఈ మూవీలో నయనతార పాత్ర ఎలా ఉండబోతుంది... తన నటనతో ఆకట్టుకుంటుందా... అనే విషయాలు తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే. ప్రస్తుతానికైతే ఈ ట్రైలర్ తో సరిపెట్టుకోండి అంటున్నారు మూవీ మేకర్స్.