కడెం, వెలుగు: నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలోని దేవునిగూడెంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. శుక్రవారం రాత్రి గ్రామంలోని ఓ ఇంటి వద్ద మనిషి వెన్నుముక, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, జిల్లేడు, రాగి, మర్రి ఆకులు, ఇతర వస్తువులను పెట్టారురు. బాధిత కుటుంబీకులు ఉదయం లేచి, ఇంటి ముందు ఉన్న దృశ్యాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
