బాసర, వెలుగు: నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి ఆలయానికి ఎస్బీఐ బ్యాంకు ఆర్థిక సహకారంతో మినీ బస్సును విరాళంగా అందించారు. శనివారం హైదరాబాద్లో జరిగిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాస్ శెట్టి, ఆలయ ఈవో, స్థానిక బ్యాంకు అధికారుల సమక్షంలో ఆలయ సిబ్బందికి మినీ బస్సును అందజేశారు.
బాసర రైల్వేస్టేషన్ నుంచి ఆలయానికి, ఆలయం నుంచి గోదావరి నదికి, గోదావరి నుంచి రైల్వే స్టేషన్ కు ఉచిత సర్వీసులు అందించేందుకు మినీ బస్సును వినియోగిస్తామని ఆలయ ఈవో అంజనీదేవి తెలిపారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
