ప్రభుత్వ స్కూల్ లో క్షుద్ర పూజల కలకలం ..వరంగల్ జిల్లా మైలారం పాఠశాలలో ఘటన

ప్రభుత్వ స్కూల్ లో క్షుద్ర పూజల కలకలం ..వరంగల్ జిల్లా మైలారం పాఠశాలలో ఘటన

రాయపర్తి, వెలుగు: వరంగల్​జిల్లా రాయపర్తి మండలంలోని మైలారం ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. మంగళవారం అర్ధరాత్రి పాఠశాల తరగతి గదుల ముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో ముగ్గు వేసి పూజలు చేశారు. 

బుధవారం ఉదయం స్కూల్ కు వచ్చిన  విద్యార్థులు చూసి భయాందోళన చెందారు. ఉపాధ్యాయుల ఫిర్యాదుతో పోలీసులు వెళ్లి పరిశీలించి  విచారణ చేపట్టారు. క్షుద్రపూజల ఘటనతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. బాధ్యులను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.