IND vs PAK: ఫోర్లు, సిక్సర్లు కొట్టారన్న ఫ్రస్టేషన్.. అయ్యర్‌పైకి బాల్ విసిరిన పాక్ పేసర్

IND vs PAK: ఫోర్లు, సిక్సర్లు కొట్టారన్న ఫ్రస్టేషన్.. అయ్యర్‌పైకి బాల్ విసిరిన పాక్ పేసర్

అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన దాయాదుల పోరు ఆశించిన మజా అందించలేదు. మొదట పాక్ బ్యాటర్లు విఫలమవ్వడం.. అనంతరం బౌలర్లు అదే దారిలో నడవడంతో మ్యాచ్ చాలా చప్పగా సాగింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్ 191 పరుగులకే కుప్పకూలగా.. ఛేజింగ్ లో రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. నలువైపులా బౌండరీలు బాదుతూ పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన పాక్ బౌలర్ హ్యారీస్‌ రౌఫ్ అత్యుత్సాహం చూపాడు. 

భారత ఇన్నింగ్స్‌ 9 ఓవర్‌ వేసిన రౌఫ్.. మొదటి ఓవర్‌లోనే 14 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అసహనానికి లోనైన అతడు.. తన తదుపరి ఓవర్‌లో ఆ కోపాన్ని శ్రేయాస్ అయ్యర్ పై చూపించాడు. ఓ బంతిని అయ్యర్‌.. తన వైపు డిఫెన్స్‌ ఆడగా బంతిని అందుకున్న అతడు.. శ్రేయస్‌పై వైపు విసిరాడు. దీంతో అయ్యర్‌ ఒక్కసారిగా పక్కకు తప్పుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

అగ్రస్థానం మనదే

ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు చిత్తుచిత్తుగా ఓడింది. పాక్ నిర్ధేశించిన 192 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్..  మరో 20 ఓవర్లు మిగిలివుండగానే చేధించింది. లక్ష్య ఛేదనలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ(86; 63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సులు) వీరవిహారం చేశాడు. ఈ విజయంతో భారత్(+1.821) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)