యాక్సిడెంట్ తర్వాత.. ఆ రైల్వేస్టేషన్ ను సీజ్ చేశారు.. రైళ్లు ఆగటం లేదు

యాక్సిడెంట్ తర్వాత.. ఆ రైల్వేస్టేషన్ ను సీజ్ చేశారు.. రైళ్లు ఆగటం లేదు

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం అనంతరం రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.  బహనాగా బజార్ స్టేషన్‌ను సీల్ చేసినందున, అక్కడ ఏ రైలు ఆగదని వెల్లడించారు. లాగిన్ బుక్, రిలే ప్యానెల్, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్న సీబీఐ.. స్టేషన్‌ను సీల్ చేసినట్లు సౌత్ ఈస్టర్న్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఆదిత్య కుమార్ చౌదరి తెలిపారు. "సిగ్నలింగ్ వ్యవస్థకు సిబ్బందికి ప్రవేశాన్ని నిషేధిస్తూ రిలే ఇంటర్‌లాకింగ్ ప్యానెల్ సీలు చేశారు. తదుపరి నోటీసు వచ్చేవరకు బహనాగ బజార్‌లో ఎటువంటి ప్రయాణీకులు లేదా గూడ్స్ రైలు ఆగదని చౌదరి అన్నారు.

బహనాగ బజార్ రైల్వే స్టేషన్ గుండా ప్రతిరోజూ దాదాపు 170 రైళ్లు ప్రయాణిస్తున్నప్పటికీ, భద్రక్-బాలాసోర్ MEMU, హౌరా భద్రక్ బఘజతిన్ ఫాస్ట్ ప్యాసింజర్, ఖరగ్‌పూర్ ఖుర్దా రోడ్ ఫాస్ట్ పాసింజర్ వంటి ప్యాసింజర్ రైళ్లు మాత్రమే స్టేషన్‌లో ఒక నిమిషం పాటు ఆగుతాయి. ఇక జూన 2న జరిగిన ఈ రైలు ప్రమాదంలో 288మంది చనిపోగా, దాదాపు 1,208 మంది గాయపడ్డారు. వీరిలో 709 మంది ప్రయాణికులకు రైల్వే శాఖ ఇప్పటికే ఎక్స్‌గ్రేషియా అందించిందని అధికారులు తెలిపారు.