లాడెన్ కుమారుడి ఆచూకీ చెప్తే రూ.7 కోట్ల రివార్డు 

లాడెన్ కుమారుడి ఆచూకీ చెప్తే రూ.7 కోట్ల రివార్డు 

భారత్ పై జరిగిన పుల్వామా ఉగ్రదాడి తర్వాత జరుగుతున్న పరిణామాల క్రమంలో ఆల్ ఖైదా పేరు మరోసారి తెరమీదకొచ్చింది. ఒసామా బిన్ లాడెన్ చనిపోయిన తర్వాత ఆల్ ఖైదా కార్యాకలాపాలను లాడెన్ కుమారుడు చూస్తున్నాడన్న వార్తలతో అమెరికా లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్ ఆచూకీ చెబితే 7 కోట్ల రివార్డ్ ఇస్తానని ప్రకటించింది. దీంతో సౌదీ అరేబియా తమ దేశ పౌరుడిగా ఉన్న హింజా బిన్ లాడెన్ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

సెప్టెంబర్ 11, 2001లో అమెరికాలోని ప్రపంచ వాణిజ్య కేంద్రాన్ని కూల్చివేసిన ఘటన గుర్తొస్తుంది. అగ్ర దేశానికే సవాల్ విసిరిన ఒసామా బిన్ లాడెన్ ను అమెరికా అంతమొందించినప్పటికీ చాపకింద నీరులా ఆల్ ఖైదా కార్యాకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయని తెలుస్తుంది. లాడెన్ 15వ కుమారుడైన హంజా బిన్ లాడెన్ …తండ్రి స్థానంలో ఆల్ ఖైదా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడంటూ అమెరికా చెబుతోంది. ఇందులో భాగంగానే అతని ఆచూకీ చెబితే 7కోట్ల రివార్డు ఇస్తామని ప్రకటించింది.

అమెరికా తీసుకున్న నిర్ణయంతో సౌదీ అరేబియా కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్ పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ కీలక నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.సౌదీ అరేబియా సర్కారుకు వ్యతిరేకంగా సౌదీ తెగల కోసం పోరాడుతున్న హంజా.. పాకిస్తాన్, అప్ఘనిస్తాన్, సిరియా దేశాల్లో సంచరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.