ఆసక్తికరంగా ‘18 పేజెస్’ ట్రైలర్’

ఆసక్తికరంగా ‘18 పేజెస్’ ట్రైలర్’

నిఖిల్‌ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘18 పేజెస్‌’ చిత్ర ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. నీకు ఫేస్ బుక్ లేదా అని నిఖిల్ అంటే.. లేదు అని హీరోయిన్ చెప్పడంతో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఫోన్ కు, సోషల్ మీడియాకు దూరంగా ఉండే అమ్మాయిని.. ప్రేమించడం.. అనుకోకుండా ఆమె ప్రమాదంలో పడితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో అనే కథతో సినిమాను తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. హీరోయిన్ అనుపమ రాసుకున్న 18 పేజీలను చదువుతాడు.

ట్రైలర్ లో యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నాయి. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ మధ్య కెమిస్ట్రీని అందంగా చూపించారు. ‘ప్రేమించడానికి రీజన్ ఉండకూడదు, ఎందుకు ప్రేమిస్తున్నాం అంటే ఆన్సర్ ఉండకూడదు’ వంటి డైలాగ్స్‌ ఆకట్టుకొనే విధంగా ఉన్నాయి. ‘జీఏ 2’ పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 23న విడుదల కానుంది. ‘కుమారి 21ఎఫ్‌’ డైరెక్టర్‌ సూర్యప్రతాప్‌ పల్నాటి దర్శకత్వం వహించగా... సుకుమార్‌ కథ అందించారు. ‘కార్తికేయ 2’ పాన్ ఇండియా హిట్ మూవీ తర్వాత నిఖిల్ మరో హిట్ కొడుతాడా ? లేదా ? అనేది వేచిచూడాల్సిందే.