అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు పంజా

అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు పంజా

వివాదాస్పద భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా వెలసిన అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు పంజా విసిరారు. హైదరాబాద్ శివారు పటాన్ చెరు నియోజకవర్గంలోని ఐలాపూర్ తాండ, ఐలాపూర్ గ్రామాల్లో భారీగా చేపట్టిన అక్రమ నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేస్తున్నారు. మే 13వ తేదీ శనివారం తెల్లవారు జామునుంచే కూల్చివేతల పర్వం మొదలైంది. 

అక్రమంగా నిర్మించిన ఇళ్లలను జేసీబీ, హిటాచిలతో కూల్చివేశారు అధికారులు. సంగారెడ్ జిల్లా వ్యాప్తంగా ఉన్న రెవెన్యూ సిబ్బందితో కలిసి పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలను చేపడుతున్నారు. సర్వే నంబర్ 12లోని అక్రమ నిర్మాణాలను, ఐలాపూర్ తాండలోని ఇళ్లను కూడా కూల్చివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో గ్రామస్తులు అధికారులను అడ్డుకున్నారు. తమకు నోటీసులు ఇవ్వకుండా ఇండ్లు ఎలా కూల్చుతారని ఇంటి యజమానులు  అధికారులను నిలదీశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.