
హైదరాబాద్ : హైదరాబాద్‌లో జూన్ 26వ తేదీ నుంచి 22 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వేశాఖ అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజనల్ రైల్వే పరిధిలో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ది పనుల క్రమంలో మొత్తం 22 ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులు రద్దు చేస్తూ శుక్రవారం (జూన్ 23న) దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
జూన్ 26 నుంచి జులై 2 వరకు అంటే దాదాపు ఏడు రోజులు ఈ సర్వీసులు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. లింగంపల్లి- హైదరాబాద్, ఉందానగర్ -లింగంపల్లి, ఫలక్‌నుమా- లింగంపల్లి స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు చేశామని పేర్కొన్నారు. రైళ్ల రద్దు వల్ల నగర ప్రయాణికులకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు ప్రత్యామ్నాయ రవాణాను ఎంచుకోవాలని సూచించారు.