
ఇబ్రహీంపట్నం/ కూకట్పల్లి/ జీడిమెట్ల/ మియాపూర్, వెలుగు: స్కూళ్ల రీ ఓపెనింగ్ సందర్భంగా ఆర్టీఏ అధికారులు నగరంలో పలుచోట్ల స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలు పాటించని 30 స్కూల్ బస్సులను గురువారం సీజ్ చేశారు. ఫిట్‌నెట్, పర్మిట్ లేకుండా రోడ్డెక్కిన వాహనాలపై వేటు వేశారు. ఇబ్రహీంపట్నంలో ఆర్టీఏ వి.సుభాష్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు.
కందుకూరులో 2, ఇబ్రహీంపట్నంలో 1, అబ్దుల్లాపుర్‌మెట్‌లో 1 స్కూల్ బస్సును సీజ్ చేశారు. 8 బస్సుల్లో అటెండర్లు లేకపోవడంతో కేసులు నమోదు చేశారు. కూకట్‌పల్లిలో ఓవర్ లోడ్‌తో వెళ్తున్న శ్రీ చైతన్య కాలేజీ బస్సు, నారాయణ స్కూల్ బస్సును సీజ్ చేశారు. కేపీహెచ్‌బీ కాలనీ, ఉషా ముళ్లపూడి రోడ్డులోని తులసివనం వద్ద నిర్వహించిన తనిఖీల్లో ఫిట్నెస్ సర్టిఫికెట్, ఫస్ట్‌ఎయిడ్ కిట్ లేకుండా, కట్టకుండా తిరుగుతున్న నాలుగు స్కూల్ బస్సులను సీజ్‌చేశారు.
మేడ్చల్ ఆర్టీఏ పరిధిలో 11, ఉప్పల్ ఆర్టీఏ పరిధిలో 5 బస్సులను సీజ్ చేశారు. మియాపూర్ ఆల్విన్ చౌరస్తా వద్ద ఆర్టీఏ అధికారి నవీన్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి 4 స్కూల్ బస్సులను సీజ్ చేశారు.