వరద ప్రాంతాల్లో డ్రోన్ ​సేవలు భేష్ : బాధితులకు తక్షణ సాయం కోసం వాడకం

వరద ప్రాంతాల్లో డ్రోన్ ​సేవలు భేష్ : బాధితులకు తక్షణ సాయం కోసం వాడకం
  • డీఆర్ఎఫ్​టీమ్ లు వెళ్లలేని ప్రాంతాలకు సామగ్రి సరఫరా 
  • ఫుడ్, వాటర్, మెడిసిన్, లైఫ్ జాకెట్ల వంటివి అందజేత 
  • రాష్ట్రవ్యాప్తంగా ఎమర్జెన్సీ సేవలకు వినియోగించాలంటున్న ప్రజలు

వరంగల్, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల వల్ల కోల్పోయిన బాధితులకు తక్షణ సేవలు అందించేందుకు అధికారులు డ్రోన్ సేవలు వినియోగించి శభాష్ అనిపించారు. మన రాష్ట్రంలోని ఖమ్మం, ఏపీలోని విజయవాడలో వరద బీభత్సం సృష్టించడంతో ముంపులో చిక్కుకుపోయిన ప్రజలను కాపాడేందుకు ఎమర్జెన్సీ సేవల్లో డ్రోన్లను వాడి సక్సెస్ అయ్యారు. ఇప్పటిదాకా వరదలు, ఇతర పనులకు ఏరియల్​సర్వే చేసేందుకు డ్రోన్లను వినియోగించారు. 

ఇందుకు ఉదాహరణగా చెప్పుకుంటే.. మేడారం జాతరకు తరలివచ్చిన కోటిన్నర మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన సేవలు అందించేందుకు ముందుగా డ్రోన్ కెమెరాల ద్వారా సర్వే చేసి..అందుకనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే రెండేండ్ల కిందట హైదరాబాద్, వరంగల్​వంటి సిటీల్లో ముంపు ప్రాంతాల్లోని కాలనీల్లో సాయం కోసం ఎదురు చూసే బాధితుల గుర్తింపులో డ్రోన్లు కీలకంగా మారాయి. ప్రస్తుతం వచ్చిన వరదల్లోనూ డ్రోన్లు ఎమర్జెన్సీ సేవలకు వినియోగించారు. 

పోలీసులు, డీఆర్ఎఫ్​ టీమ్ లు వెళ్లలేని ప్రాంతాల్లోని గల్లీల్లోనూ,  అపార్టుమెంట్లు, ఇండ్లలో ఉండిపోయిన బాధితులకు డ్రోన్ల ద్వారా ఫుడ్, వాటర్, మెడిసిన్ వంటివి సరఫరా చేశారు. ఇలాంటి వాటికి రాష్ట్రంలోనే తొలిసారిగా ఖమ్మం వరదల్లో చిక్కిన బాధితులకు సేవలం దించేందుకు వినియోగించారు. అవసరమైన ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా బాధితులకు సకాలంలో లైఫ్​జాకెట్లు, తాళ్లను పంపించి ప్రాణాలను రక్షించారు. దీంతో ఎమర్జెన్సీ సేవల్లోనూ డ్రోన్లను వాడి అధికారులు సక్సెస్ అయ్యారు. 

ఇకముందు కూడా సేవలకు డ్రోన్లను వాడాలంటూ.. 

రాష్ట్రవ్యాప్తంగా ఇకముందు కూడా ఎమర్జెన్సీ అవసరాలకు డ్రోన్లను వినియోగించాలనే  డిమాండ్లు ప్రజల నుంచి వస్తున్నాయి. ఏటా వానాకాలంలో భారీ వర్షాలు కురవడం, వరదలు, ముంపు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండడం తెలిసిందే. ఎమర్జెన్సీ సేవలు అందించాలంటే మోడ్రన్ టెక్నాలజీ కలిగిన డ్రోన్ల సేవలు అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. విపత్తులు సంభవించినప్పుడు డ్రోన్ల సేవలను వినియోగిస్తే ప్రాణ నష్ట తీవ్రతను తగ్గించడమే కాకుండా మ్యాన్​పవర్​లేకుండానే ఫలితాలు సాధించొచ్చు. కాగా, వరదల్లో లైఫ్​జాకెట్లు అందించి బాధితులను రక్షించిన డ్రోన్లను భవిష్యత్ లో రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకొస్తే ఎమర్జెన్సీ సమయాల్లో  ప్రాణ నష్టాన్ని  అరికట్టే అవకాశం కూడా ఉంటుంది. 

డ్రోన్ వ్యవస్థను అభివృద్ధి చేస్తే.. 

యూపీలో ప్రస్తుతం తోడేళ్లను పట్టుకునేందుకు ‘ ఆపరేషన్‌‌ బేడియా’ కోసం థర్మల్‌‌ ఇమేజ్‌‌ టెక్నాలజీ  డ్రోన్లను వినియోగి స్తున్నారు. వయనాడ్‌‌లో వరదల్లో శిథిలాల కింద చిక్కుకుపో యిన మనుషులను  గుర్తించడానికి రాడార్ డ్రోన్ల ను వాడారు. విజయవాడ, ఖమ్మం జల దిగ్బంధాలను కూడా డ్రోన్లే చూపిం చాయి. ఇలా విపత్కర పరిస్థితుల్లో మనుషులు వెళ్లలేని ప్రాంతాలకు అవసరాన్ని బట్టి డ్రోన్లను అందుబాటు లోకి తీసు కొస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మన రాష్ట్రంలో వ్యవసాయంలో రైతులకు శ్రమ తగ్గించి, పంట ల్లో దిగుబడి పెంచేలా ఎరువులు, పురుగు మందులు స్ర్పే చేసేం దుకు పలు జిల్లాలో ప్రత్యేక డ్రోన్లు అందుబాటులోకి తెచ్చారు. ఇదే తరహాలో డ్రోన్​ వ్యవస్థను మరింత డెవలప్‌‌ చేసేందుకు రాష్ట్ర సర్కార్​ చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.