విజయ్ 68 మూవీలో హీరోయిన్గా.. OG బ్యూటీ ప్రియాంక మోహన్!

విజయ్ 68 మూవీలో హీరోయిన్గా.. OG బ్యూటీ ప్రియాంక మోహన్!

కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజయ్‌‌(Thalapathy Vijay)కి టాలీవుడ్‌‌ లోనూ మంచి ఇమేజ్ ఉంది. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో లియో చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ తర్వాత విజయ్ మరో క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు(Venkatprabhu)  డైరెక్షన్‌‌లో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ విజయ్ 68 వ చిత్రంగా రాబోతున్నట్లు డైరెక్టర్ ముందే తెలిపారు. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ మూవీలో హీరోయిన్ గా ప్రియాంకా అరుళ్ మోహన్(Priyanka Arul Mohan) ఖరారైనట్లు సమాచారం. ఈ మూవీలో జ్యోతిక కీ రోల్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీలో ముందుగా పలు హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. ఈ సినిమాలో త్రిష నటిస్తోందనే వార్తలు వచ్చాయి. అలాగే డైరెక్టర్ ఎస్ శంకర్ డాటర్ ప్రియా భవాని శంకర్ పేరు కూడా వినిపించింది.

 కానీ ఇప్పుడు లేటెస్ట్గా ప్రియాంక మోహన్ విజయ్68 లో కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది. ప్రియాంకా అరుళ్ మోహన్ వరుస మూవీస్ తో దూసుకెళ్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG మూవీలో కూడా హీరోయిన్గా నటిస్తుంది. దీంతో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వస్తుండటంతో ఇక కోలీవుడ్ లో టాప్ ప్లేస్ కి వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. నాని గ్యాంగ్ లీడర్, శివ కార్తికేయన్ డాన్ మూవీలో నటించిన ప్రియాంక కు తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే ఉంది.   

ALSO READ : ఈ డబ్బులు తీసుకుని పాస్ చేయండి : పరీక్ష పేపర్లలో నోట్లు పెట్టిన స్టూడెంట్స్

విజయ్ 68 లో జ్యోతిక ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది. ఇక ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నట్టు, ఏ.జి.ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌‌‌‌పై అర్చన కల్పతి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ మూవీ 2024 సమ్మర్ లో రిలీజ్ కానుంది.  డైరెక్టర్ వెంకట్ ప్రభు రీసెంట్ గా నాగ చైతన్య తో కస్టడీ మూవీ తీసిన సంగతి తెలిసిందే.