ఈ డబ్బులు తీసుకుని పాస్ చేయండి : పరీక్ష పేపర్లలో నోట్లు పెట్టిన స్టూడెంట్స్

ఈ డబ్బులు తీసుకుని పాస్ చేయండి : పరీక్ష పేపర్లలో నోట్లు పెట్టిన స్టూడెంట్స్

చదువుకోండి రా బాబూ అంటే.. చదువు కొంటాం కానీ.. చదువుకోం అంటున్నారు నేటి స్టూడెంట్స్. ఏడాదంతా స్కూల్, కాలేజీల పేరుతో ఇళ్ల నుంచి బయటకు వచ్చి.. రోడ్లపై బలాదూర్లు తిరిగి.. సినిమాలు అని షికార్లు చేసి.. హీరోల ఫంక్షన్లకు గాలి తిరుగుళ్లు తిరిగి.. తీరా పరీక్షకు వచ్చే సరికి తెల్లముఖం వేయటం కామన్ అయిపోయింది. గతంలో అయితే టీచర్ – స్టూడెంట్ మధ్య అనుబంధం ఉండేది.. ఎగ్జామ్స్ అంటే మేడం.. మేడం అంటూ రిక్వెస్టులు చేసుకునే వారు.. ఆ పేపర్ టఫ్ మేడం.. కాంచెం చూసి మార్కులు వేయండి అంటూ బతిమాలుకునే వారు..

ఇప్పుడు ట్రెండ్ మారింది. టీచర్లను కూడా లంచాలతో కొడుతున్నారు.. నోట్లు పడేస్తే పాస్ చేసేస్తారనే ఫీలింగ్.. దీంతో నేటి యువత.. తమ ఎగ్జామ్ ఆన్సర్ షీట్స్ లో డబ్బులు పెట్టి.. ఈ డబ్బులు తీసుకుని పాస్ చేయండి అంటూ బరితెగించేసే స్థాయికి వెళ్లారు. ఇలా ఆన్సర్ షీట్స్ లో వచ్చిన డబ్బులను ఎక్స్ లో పోస్ట్ చేయటంలో.. ఇది ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ALSO READ : కేసీఆర్ ప్రకటించిన ఒక్క అభ్యర్థి కూడా గెలవడు : పొంగులేటి

ఒడిశాకు చెందిన ఐపీఎస్ అరుణ్ బోత్రా కూడా ఇలాంటి ఘటననే సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. విద్యార్థులు తమను ఉత్తీర్ణులను చేయాలని బోర్డు సమాధాన పత్రాల్లో నగదును ఎలా ఉంచుతారో, ఉపాధ్యాయులను ఎలా అడుగుతారో ఆయన చెప్పుకొచ్చారు. రూ. 100, రూ.200, రూ. 500 లాంటి పలు నోట్ల చిత్రాన్ని షేర్ చేసిన ఆయన..  ఈ ఫొటోను ఒక టీచర్ పంపారని చెప్పాడు. ఈ నోట్‌లను విద్యార్థులు తమకు పాస్ మార్కులు వేయాలని అభ్యర్థిస్తూ.. తమ బోర్డు పరీక్ష జవాబు పత్రాలలో ఉంచారని, ఇది విద్యార్థులు, ఉపాధ్యాయులు, మొత్తం విద్యా వ్యవస్థ చెబుతుందని అరుణ్ బోత్రా అన్నారు.

ఈ ఘటనపై సోషల్ మీడియా యూజర్స్ తీవ్రంగా స్పందించారు. “ఇది దశాబ్దాలుగా జరుగుతోంది. కొంతమంది విద్యార్థులు డబ్బును చొప్పిస్తారు; మన కాలంలో, పేపర్ పాస్ అయితే చాలా డబ్బు వస్తుందని వాగ్దానం చేస్తూ కొందరు ఫోన్ నంబర్లను సమాధానాలలో చేర్చేవారు అని ఓ యూజర్ కామెంట్ చేశారు. "ఇది దేశం మొత్తం సంస్కృతి, సంస్థలు, ప్రజాస్వామ్యం గురించి చెబుతుంది" అని మరొకరు రాసుకువచ్చారు.

ఈ పోస్ట్ ఇప్పటివరకు దాదాపు 1మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే లంచం తీసుకున్నారనే ఆరోపణలపై కొట్టాయంలోని అసిస్టెంట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (ఏఈవో)తో పాటు ఎయిడెడ్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని కేరళ ప్రభుత్వం ఆగస్టు 18న సస్పెండ్ చేసింది.