ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన రోడ్లపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. మెయిన్ రోడ్లపై క్యూఆర్ కోడ్ స్కానర్లను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. 'స్మార్ట్ రోడ్ల భవిష్యత్తుభద్రత' అనే అంశంపై ఢిల్లీలో నిర్వహించిన సమావే శంలో గడ్కరీ ప్రసంగించారు.
“రోడ్లు బాగా లేకపోతే అందరూ నన్నే నిందిస్తరు.. మొత్తం సిస్టమ్ చేసిన మిస్టేక్కు నేను మాత్రమే ఎందుకు తిట్లు తినాలి. అందుకోసమే రోడ్లకు సంబంధించిన సమాచారం ప్రజలకు తెలియజేసేందుకు భవిష్యత్ లో క్యూఆర్ కోడ్లను తీసుకొస్తం.. రోడ్లపైన స్కానింగ్ బోర్డులు ఏర్పాటు చేస్తం. స్మార్ట్ ఫోన్లో స్కాన్ చేయగానే రోడ్డుకు సంబంధించిన సమాచారం వచ్చేస్తుంది. రోడ్లు ఎవరు వేశారు?.. కాంట్రాక్టర్ ఎవరు? ఎవరెవరు పనులు చేశారో వాళ్ల సమాచారం.. ఫోన్ నెంబర్లతో సహా వచ్చేస్తుం ది. అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. రోడ్ల నిర్మాణంలో అవినీతికి పాల్పడే అధికారులకు ప్రజలే బుద్ధి చెబుతారు' అని అన్నారు.
►ALSO READ | నాకు బ్రేకప్ అయ్యింది.. లీవ్ కావాలి సర్.. ఢిల్లీలో మహిళా ఉద్యోగి మెయిల్తో సీఈఓ షాక్.. ఏం చేశాడంటే
