ఓట్ల కోసం ఎలాంటి డ్రామా అయినా ఆడతారు.. డ్యాన్స్ చేయమన్నా చేస్తారు.. పీఎం మోదీపై రాహుల్ విమర్శలు

ఓట్ల కోసం ఎలాంటి డ్రామా అయినా ఆడతారు.. డ్యాన్స్ చేయమన్నా చేస్తారు.. పీఎం మోదీపై రాహుల్ విమర్శలు

బీహార్ ఎన్నికల ప్రచారం హాట్ హాట్ గా సాగుతోంది. విమర్శలు ప్రతివిమర్శలతో బీహార్ ఎన్నికల వాతావరణం వేడెక్కింది. లేటెస్ట్ గా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. బుధవారం (అక్టోబర్ 29) ముజఫర్ పూర్ ర్యాలీలో మహాగట్ బంధన్ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ తో పాటు పాల్గొన్న రాహుల్.. హాట్ కామెంట్స్ తో ప్రధాని మోదీపై విమర్శలకు దిగారు.

ఎన్నికల కోసం ఎలాంటి డ్రామాలైన ప్రధాని మోదీ ఆడతారని అన్నారు రాహుల్. మోదీజీ మీరు ఈ డ్రామా ఆడండి అని అడగండి.. ఓట్ల కోసం ఆడతారు. మేము మీకు ఓట్లేస్తాం.. మీరు స్టేజ్ పై ఒకసరారి డ్యాన్స్ చేయండి అని అడగండి.. ఎలాంటి మొహమాటం లేకుండా చేసేస్తారు. 

బీహార్ లో అతి పెద్ద పండుగ అయిన ఛత్ పూజ సందర్భంగా ప్రజలంతా యమునా నదిలో స్నానం చేస్తుంటే.. ఆయన స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తారు. ఆయన నమునా నది పొల్యుషన్ ను మార్చలేరు.. ఆయనకు మీ ఓట్లు మాత్రమే కావాలి.. అంటూ విమర్శలకు దిగారు. 

►ALSO READ | కెనడాలో భారతీయ వ్యాపారవేత్తపై బుల్లెట్ల వర్షం... హత్య చేసినట్లు బిష్ణోయ్ గ్యాంగ్ పోస్ట్..

రాహుల్ విమర్శలపై బీజేపీ స్పోక్స్ పర్సన్.. ప్రదీప్ బండారీ స్పందించారు. రాహుల్ గాంధీ స్థానిక గూండా అంటూ విమర్శలకు దిగారు. ఒక వీధిరౌడి మాధిరిగా రాహుల్ మాటులు ఉన్నాయంటూ మండిపడ్డారు.