ICC Wide Ball Rule: క్రికెట్‌లో కొత్త రూల్.. ఇక నుంచి లెగ్ సైడ్ వెళ్తే వైడ్ బాల్ కాదు

ICC Wide Ball Rule: క్రికెట్‌లో కొత్త రూల్.. ఇక నుంచి లెగ్ సైడ్ వెళ్తే వైడ్ బాల్ కాదు

అంతర్జాతీయ క్రికెట్‌లో వైడ్ బాల్ నియమాలు త్వరలో మారబోతున్నాయి. ప్రస్తుతం ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్నా సిరీస్ లో లెగ్ స్టంప్ వైడ్‌కు సంబంధించిన కొత్త రూల్ ను ఐసీసీ టెస్ట్ చేయడం. ఈ  రూల్ ను మొదటిసారిగా తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో ఉపయోగించారు.  మొదటి ఎడిషన్‌లోనే ఈ రూల్ విజయవంతమైంది. ఈ కొత్త రూల్ కారణంగా బౌలింగ్ చేయబడిన వైడ్ బాల్స్ సంఖ్య చాలా వరకు తగ్గింది. 2023 ఎడిషన్‌లో 319 వైడ్ బాల్స్ వేయబడ్డాయి. 2024 ఎడిషన్‌లో 311 బౌలింగ్ చేయబడ్డాయి. ఈ మార్పు కారణంగా వైడ్ బాల్స్ సంఖ్య తగ్గింది. 

పాత రూల్: 
 
వైడ్ బాల్ కు సంబంధించిన పాత రూల్ ఏంటంటే.. లెగ్ స్టంప్ దాటి వెళ్ళే ఏ బంతినైనా వైడ్ గా ప్రకటించేవారు. సెంటి మీటర్ గ్యాప్ తేడాలో బాల్ లెగ్ సైడ్ కు దూరంగా వెళ్లినప్పటికీ వైడ్ బాల్ గా పరిగణించేవారు. దీంతో బౌలర్ ఎక్స్ ట్రా డెలివరీ వేయవలసి వచ్చేది.  ఈ రూల్ బౌలలకు ప్రతికూలంగా ఉండేది. కానీ ఇప్పుడు వైడ్ కు సపరేట్ క్రీజ్ ఉంది. ఈ రూల్ ఒకప్పుడు బ్యాటర్ కు అనుకూలంగా ఉండేది. కానీ ఇప్పుడు అటు బ్యాటర్ కు.. ఇటు బౌలర్ కు సమానంగా ఉంటుంది.    

కొత్త రూల్:

ఈ కొత్త రూల్ ప్రకారం బ్యాటర్ క్రీజ్ లో ఉండి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ క్రీజ్ లు ఉంటాయి. ఈ లైన్లు లెగ్ స్టంప్‌కు కొంచెం దగ్గరగా గీస్తారు. లెగ్ సైడ్ లైన్ లోపల ఉన్న ఏ బంతినైనా వైడ్ ఇవ్వడానికి ఉండదు. ఇది బౌలర్లు లెగ్ సైడ్ వైపు ఎక్కువ బౌలింగ్ చేసినా ఎటువంటి అదనపు పరుగులు ఇవ్వకుండా చూసుకోవడానికి వీలు కల్పిస్తుంది. దానితో పాటు బ్యాటర్లకు కూడా  ఈ రూల్ ప్రయోజనకరమే. ఈ రూల్ తో బ్యాటర్స్ తమ బ్యాటింగ్ స్కిల్స్ ను మెరుగుపరుచుకోవడానికి వీలుంటుంది.