- అర్ధనగ్నంగా తిరుగుతూ, భార్యను కొడుతూ నడిరోడ్డు పై హంగామా
మంచిర్యాల, వెలుగు : ఓ కానిస్టేబుల్ మద్యం మత్తులో నడిరోడ్డుపై అర్ధనగ్నంగా తిరుగుతూ, భార్యపై దాడి చేస్తూ వీరంగం సృష్టించాడు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.
రవిప్రసాద్ అనే కానిస్టేబుల్ మంచిర్యాల పీఎస్‌లో రైటర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్యతో గొడవ పెట్టుకున్నాడు. అర్ధనగ్నంగా రోడ్డు తిరుగుతూ హంగామా చేయడమే కాకుండా భార్యను రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి తీవ్రంగా కొట్టాడు. అతడి భార్య కూడా అదే శాఖలో జాబ్ చేస్తున్న ట్లు సమాచారం. ఆమె సోమవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
