కిషన్ రెడ్డీ..యూసూఫ్ గూడా చౌరస్తాకు రా! బీజేపీ తెలంగాణకు ఏం ఇచ్చిందో చర్చిద్దాం: మంత్రి పొన్నం

కిషన్ రెడ్డీ..యూసూఫ్ గూడా చౌరస్తాకు రా! బీజేపీ తెలంగాణకు ఏం ఇచ్చిందో చర్చిద్దాం: మంత్రి పొన్నం

హైదరాబాద్: 'కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏం ఇచ్చింది.? మీరు ఏం తెచ్చారో చెప్తారా..? యూసూఫ్ గూడా చౌ రస్తాలో చర్చచేద్దాం రండి..?” అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ సవాలు విసిరారు. గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదేండ్లు రాష్ట్రా న్ని పాలించిన బీఆర్ఎస్ బాకీ కార్డు పట్టు కొని తిరుగుతూ డైవర్షన్ పాలిటిక్స్ కు పా ల్పడుతోందని అన్నారు. ప్రతి బిడ్డ నెత్తి మీద రూ.2 లక్షల అప్పుమోపిన బీఆర్ఎస్ నేతలు అసలైన బాకీ కార్డు దారులని విమర్శించా రు. 

జూబ్లీహిల్స్ లో తమ అభ్యర్థి ని నామ మాత్రంగా బీజేపీ నామమాత్రంగా పోటీలో పెట్టిందన్నారు. లంకల దీపక్ రెడ్డికి 10 వేల ఓట్లు కూడా రావన్నారు. రెండు పార్టీల లో పాయకారి ఒప్పందం లో భాగంగానే బిజెపి ప్రచారం చేస్తోందని విమర్శించారు. రెండు పార్టీల మధ్య అవగాహన ఉందని రాజాసింగ్ అంటున్నా రని గుర్తు చేశారు. 

►ALSO READ | హైదరాబాద్ పెద్ద అంబర్పేట్లో మీటర్ కావాలంటే రూ.ఆరు వేలు కొట్టాల్సిందే.. ఏసీబీకి చిక్కిన లైన్ ఇన్స్పెక్టర్

బీఆర్ఎస్ మైక్ కిషన్ రెడ్డి గొంతులోనే ఉందని అన్నారు. ఉచిత బస్సు ఎత్తేసే ఆలోచన బీఆర్ఎస్ కు ఉందని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు ఎమ్మె ల్సీ కవిత ఆరోపణలకు ముందుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.