ఏసీబీ దాడులను కొందరు ప్రభుత్వ అధికారులు లెక్కచేస్తున్నట్లు లేదు. ఎంతమందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా కూడా లంచం తీసుకోవడం ఆపడం లేదు. బుధవారం (అక్టోబర్ 29) హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్ పేట్ విద్యుత్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు లైన్ ఇన్ స్పెక్టర్.
అపార్టుమెంట్ మీటర్ రిలీజ్ కోసం ఒక వ్యక్తి అప్లై చేసుకున్న మీటర్ వచ్చినప్పటికీ.. మీటర్ రిలీజ్ కావాలంటే లంచం చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశాడు ఇన్ స్పెక్టర్ ప్రభులాల్. రూ.10 వేలు ఇవ్వాలని అడగగా.. చివరికి ఆరు వేలకు బేరం కుదిరింది. దీంతో ఏసీబీ అధికారులను సంప్రదించిన వినియోగదారుడు.. వాళ్లు చెప్పినట్లే చేసి లంచగొంది లైన్ ఇన్ స్పెక్టర్ ను పట్టించాడు.
►ALSO READ | FASTag యూజర్లకు హెచ్చరిక.. KYC పూర్తి చేయకుంటే ఆటోమ్యాటిక్ డీయాక్టివేషన్..
బాధితుడి నుంచి లంచం తీసుకుంటున్న సమయంలో దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అవినీతి నిరోధక శాఖ అధికారులు. డబ్బును స్వాధీనం చేసుకుని బాధితునికి అప్పగించారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు.
