బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రణరంగంగా మారింది. ఈ వారం వాదనలు, భావోద్వేగాలు, వ్యూహాలతో నామినేషన్ రౌండ్ హీటెక్కించింది. ఇప్పటికే హౌస్ నుండి ఎలిమినేట్ అయిన పాత కంటెస్టెంట్స్ తిరిగి రావడంతో, నామినేషన్ ప్రక్రియ ఊహించని మలుపులు తిరిగింది. ఈ ప్రత్యేక 'సెకండ్ ఛాన్స్' నామినేషన్ రౌండ్‌లో, మాజీ కంటెస్టెంట్స్ ఒకరిని నేరుగా నామినేట్ చేయగా, మరొక కత్తిని ఉపయోగించి ఇంకొకరిని బలమైన కారణాలతో నామినేట్ చేసే అవకాశం దక్కింది.
హౌస్‌లో రచ్చ రచ్చ..
ఈ నామినేషన్ల ప్రక్రియలో హౌస్‌లో వ్యక్తిగత ఘర్షణలు, వాదోపవాదాలు తారస్థాయికి చేరాయి. శ్రీజ, మాధురిల మధ్య మాటల యుద్ధం జరిగింది. తనూజ, ఇమ్మాన్యుయెల్లు ముఖాముఖి తలపడ్డారు. ముఖ్యంగా, కెప్టెన్సీ విషయంలో సంజన, సుమన్ శెట్టిల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సుమన్, సంజన కెప్టెన్సీని సమర్థవంతంగా నిర్వర్తించలేదని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కంటెస్టెంట్ల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.
ఎనిమిది మంది నామినేట్..
ఫైనల్‌గా ఈ వారం హౌస్ నుండి ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు. వారిలో మాధురి, సంజన, రీతు , తనూజ, కళ్యాణ్, రాము, డీమాన్ పవన్, గౌరవ్. వీరిలో, ముఖ్యంగా మాధురి, రాము రాథోడ్లు డేంజర్ జోన్‌లో ఉన్నట్లు సోషల్ మీడియాలో ట్రాక్ వినిపిస్తోంది. మాధురి ఈ సీజన్‌లో తన దూకుడు స్వభావంతో నిత్యం హైలైట్ అవుతోంది. టాస్క్‌లలో, నామినేషన్స్‌లో ఆమె వ్యవహారశైలి 'బిగ్ బాస్ రూల్ కాదు, నా రూల్ పాటించాలి' అన్నట్లుగా ఉందని కొంతమంది కంటెస్టెంట్స్ బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ప్లానింగ్ లేకపోయినా.. ఆమె ఎటాకింగ్ నేచర్ ప్రేక్షకుల్లో మిశ్రమ స్పందనలు వస్తోంది. కానీ, ఈ దూకుడే ఆమెకు నెగెటివ్ ఓట్లు తెచ్చే అవకాశం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
►ALSO READ | Deepika Padukone : ఓటీటీలో దీపికా పదుకొణె క్రెడిట్స్ తొలగింపు.. 'కల్కి 2898 AD' నిర్మాతలపై నెటిజన్ల ఆగ్రహం!
సైలెంట్ ప్లేయర్ డ్రా బ్యాక్ రాము రాథోడ్ విషయానికి వస్తే, బయట సింగర్‌గా, డాన్సర్‌గా మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ హౌస్‌లో మాత్రం చాలా సైలెంట్‌గా ఉంటున్నారు. టాస్క్‌లలో పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోతున్నారు. హౌస్ లో తన ఉనికిని చాటుకోలేకపోవడంతో ఆడియన్స్‌కు నిరాశ కలిగిస్తోంది. ఆట ఆడకపోవడం అనే కారణంతోనే ఎక్కువ మంది కంటెస్టెంట్స్ అతడిని నామినేట్ చేశారు.
డేంజర్ జోన్‌లో ఎవరు?
ప్రస్తుతం అందుతున్న అనధికారిక ఓటింగ్ సమాచారం ప్రకారం, ఈ వారం ఎలిమినేషన్ రేసులో గట్టి పోటీ నెలకొంది. ఊహించినట్లుగానే, తనూజ ఓటింగ్‌లో టాప్‌లో దూసుకుపోతూ సేఫ్ జోన్‌లో ఉంది. ఇక ఎలిమినేషన్‌కు అత్యంత దగ్గరగా ఉన్నవారు మాత్రం మాధురి, డీమాన్ పవన్, రీతూ చౌదరి. ఈ ముగ్గురూ ఓటింగ్‌లో చివరి స్థానాల్లో ఉన్నారు. సంజన, గౌరవ్ కూడా డేంజర్ జోన్‌కు దగ్గరగానే ఉన్నప్పటికీ, మాధురి, పవన్, రీతూలలో ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ డేంజర్ జోన్ కంటెస్టెంట్స్‌లో ప్రేక్షకులెవరిని హౌస్‌లో ఉంచుతారు.. ఎవరి ఎలిమినేట్ చేస్తారో ఆదివారం తేలనుంది.
