సికింద్రాబాద్- విజయవాడ రూట్ లో.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు

సికింద్రాబాద్- విజయవాడ రూట్ లో.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు

మోంథా తుఫాన్ ఎఫెక్ట్  తో తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మహూబూబ్ నగర్ , నల్లగొండ, మెదక్ జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. చాలా చోట్ల  రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

పలు చోట్ల స్టేషన్‎లోకి భారీగా వరద నీరు చేరి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో  రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేస్తున్నారు. కొన్ని రైళ్లను దారి మళ్లీస్తున్నారు. పలు చోట్ల  భారీ వర్షం కారణంగా  రైళ్లు రైల్వే స్టేషన్లోనే నిలిచిపోయాయి. దీంతో  ప్రయాణికులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. అటు బస్సులు లేక, రైళ్లు లేక ఎక్కడిక్కడే ఆగిపోయారు.  
 
 సికింద్రాబాద్ టు విజయవాడ వెళ్లే రూట్లో పలు రైళ్లు రద్దు చేశారు అధికారులు.  ఈస్ట్ కోస్ట్.. గోదావరి ఎక్స్ ప్రెస్,  మహబూబా నగర్ ఎక్స్ ప్రెస్,   సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే గరీబ్ రద్ ట్రైన్ ను  రద్దు చేశారు. ఇంటర్ సిటీ.. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు వరంగల్ రైల్వేస్టేషన్లో నిలిచిపోయింది.  మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో కృష్ణా ఎక్స్ ప్రెస్ ... డోర్నకల్ రైల్వేస్టేషన్లో గోల్కొండ  ఎక్స్ ప్రెస్ నిలిచిపోయింది. ఉండ్రాతి మడుగు రైల్వే స్టేషన్ లో కోణార్క్ ఎక్స్ ప్రెస్ ను  నిలిపివేశారు  అధికారులు . రైళ్ల రద్దు కావడంతో  రైల్వే స్టేషన్లలోనే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. రైల్వే స్టేషన్లలో హెల్ప్ సెంటర్ ఏర్పాటు చేశారు అధికారులు.  ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు.  

ALSO READ : హైదరాబాద్ జంట జలాశయాల గేట్లు ఓపెన్..

మరో వైపు రాగల 3గంటలు హైదరాబాద్ తో పాటు,హన్మకొండ,జోగులాంబ గద్వాల జిల్లా, మహబూబాబాద్,మహబూబ్ నగర్ , మేడ్చల్ మల్కాజ్ గిరి,, నారాయణపేట, రంగారెడ్డి,  వరంగల్,వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు వాతావరణ శాఖా భారీ వర్ష సూచన చేసింది. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని సూచించింది వాతావరణ శాఖ.