లక్ష జాబ్స్ కట్: బార్లలో ఖర్చు పెట్టడం తగ్గించుకోండి.. పైసలు సేవ్ చేసుకోండి.. ఐటీ ఉద్యోగులకు దడ పుట్టిస్తున్న కోబెస్సీ లెటర్..

లక్ష జాబ్స్ కట్: బార్లలో ఖర్చు పెట్టడం తగ్గించుకోండి.. పైసలు సేవ్ చేసుకోండి.. ఐటీ ఉద్యోగులకు దడ పుట్టిస్తున్న కోబెస్సీ లెటర్..

ఐటీ ఇండస్ట్రీతో  ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్.. అంటే మానవ వనరుల అభివృద్ధి పరంగా గణనీయమైన వృద్ధి నమోదైంది. ముఖ్యంగా ఇండియాలో పేద, మధ్యతరగతి వర్గాలు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందండంలో ఐటీ ఇండస్ట్రీ చాలా తోడ్పడింది. చాలా మంది మిలియనీర్ల జాబితాలో చేరిపోయారని నివేదికలు వెల్లడిస్తున్నాయి.. 

కానీ ఇటీవల అత్యంత రిస్క్ లో ఉన్న ప్రొఫెషన్ ఏంటంటే టెక్ ఇండస్ట్రీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. అంటే కృత్రిమ మేధ వచ్చిన తర్వాత ఎవరి జాబ్ ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి . ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు లక్ష మంది జాబ్స్ ఊస్ట్ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఆర్థిక అనిశ్చితి నుంచి బయటపడేందుకు ఎంప్లాయ్స్ మేలుకోకుంటే అంతే సంగతులని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తు్న్నారు. 

దడ పుట్టిస్తున్న కోబెస్సీ లెటర్..

రీసెంట్ గా కోబెస్సీ లెటర్ (The Kobessi Letter) పేజ్ ఎక్స్ లో చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది. దానికి తోడు ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసింది. ప్రపంచంలోనే లీడింగ్ కంపెనీలు లక్షకుపైగా ఉద్యోగులను తొలగించాయి. అందులో ముఖ్యంగా UPS కంపెనీ -48 వేల మందిని తొలగించగా,  అమెజాన్ - 30 వేల వరకు, ఇంటెల్ 24 వేలు, నెస్ట్లే-16 వేలు,  యాక్సెంచర్ (Accenture) - 11 వేలు, మైక్రోసాఫ్ట్ 7 వేలు ఉద్యోగులను తొలగించినట్లు పేర్కొంది. లేబర్ మార్కెట్ రోజు రోజుకూ బలహీన పడుతోందని ఆ పోస్ట్ లో పేర్కొంది. 

ఐటీ ప్రొఫెషనల్స్ సలహాలు:

కోబెస్సీ లెటర్ పై హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. చాలా మంది ఐటీ ప్రొఫెషనల్స్ తమ అభిప్రాయాలను.. సలహాలను పోస్ట్ చేస్తున్నారు. ఇలాంటి కష్టకాలంలో ఐటీ ఎంప్లాయ్స్ హాబిట్స్ మారకుండే పాతాళానికి పడిపోయినట్లేనని హెచ్చరిస్తున్నారు.

బార్లలో ఖర్చు చేయడం మానేయండి..

సెర్జియో అనే సీనియర్ ఐటీ కన్సల్టెంట్ ఆసక్తికర సలహాలు ఇచ్చాడు. లేయాఫ్స్ అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. అత్యంత వేగంగా మార్పులు చెందుతున్నాయి.. కానీ ఒక యావరేజ్ ఎంప్లాయ్ వాటికి ప్రిపేర్డ్ గా రెడీగా లేడు. మానవ చరిత్రలోనే ఊహించలేని పీరియడ్ లోకి ఎంటరవుతున్నాం. మీకు వీలైనంతగా మార్పుకు తగినట్లుగా మిమ్మిల్ని మీరు మార్చుకోండి. ఇప్పుడు బార్లలో ఖర్చుచేసే సమయం కాదు.. రోజూ బయట తినే టైమ్ అసలే కాదు. ఖర్చులను తగ్గించి.. ఆదాయాన్ని పెంచుకోవడం.. సేవింగ్స్, ఇన్వెస్ట్ మెంట్ మార్గాలు చూసుకోవడమే మన ముందున్న మార్గం. అదొక్కటే మనల్ని సర్వైవ్ చేస్తుందంటూ చెప్పుకొచ్చాడు. 

నియోన్ క్యాట్ అనే పేరున ఉన్న మరో యూజర్ .. నాకు ఏఐ రిలేటెడ్ జాబ్ అవకాశం వచ్చింది. వెయిటింగ్ చేస్తూ చేస్తూ ఉండగా.. ఉన్నట్లుండి ఆ జాబ్ పోయింది. ఈ జాబ్ కోసం ట్రై చేస్తున్న టైమ్ లో ఉన్న జాబ్ కూడా ఊడిపోయిందని రాసుకొచ్చాడు. 

అంగార్లో అనే మరో యూజర్.. లేయాఫ్స్ అనేవి మార్కెట్ ప్రెజర్ వలన కాదని.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా లాంగ్ టర్మ్ షిఫ్ట్ లో భాగంగా ఉద్యోగాలు ఊడుతున్నాయి. ఇది టెంపరరీ కాదు.. కంటిన్యూగా ఉండేదే.. ఇది అందరూ గమనించాల్సిందేనని చెప్పాడు. 

సీనియర్ ఎంప్లాయ్స్కు ఎక్కువ రిస్క్:

మరో ఐటీ ఎంప్లాయ్ ఈ విధంగా పోస్ట్ చేశాడు. అమెజాన్ ఈ మధ్య 14 వేల మందిని సాగనంపింది. త్వరలో 16 వేల మంది ఉద్యోగులను తీసేయటానికి రెడీ గా ఉంది. సీనియర్ ఉద్యోగులు ఎక్కువగా నష్టపోతారు. ఎందుకంటే వారికే ఎక్కువగా లోన్లు, ఫ్యామిలీ ఖర్చులు, ఈయంఐలు ఉంటాయి కనుక అని.. హెచ్చరించాడు. 

టెక్నాలజీ  నుంచి మ్యానిఫ్యాక్చరింగ్ (తయారీ), రిటైల్ వరకు  అన్ని రంగాలలో ఉద్యోగాల తొలగింపుల పరంపర కొనసాతోందని..  AI- పైన ఆధారపడి నడిచే ఆర్థిక వ్యవస్థ మొదలైందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు.  ఫ్యూచర్ లో మరిన్ని ఉద్యోగాలు ఊడిపోతాయి. దీనికి తగ్గట్లుగానే ఉద్యోగులు పొదుపు మార్గం అనుసరించాలని సూచిస్తున్నారు. జాబ్ ఉన్నప్పుడు రాయల్ గా.. కాదు కాదు.. అడ్డగోలుగా ఖర్చు చేస్తే.. రోడ్డున పడ్డనాడు ఎవరూ ఆదుకునే పరిస్థితి ఉండదని హెచ్చరిస్తున్నారు.