రాజన్న సిరిసిల్ల, వెలుగు: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల జిల్లాలో రూ.20లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. వేములవాడకు చెందిన గణచారి సాంబశివరావు శుక్రవారం కారులో వెళ్తుండగా రగుడు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేయగా.. రూ. 20లక్షలు లభించాయి. డబ్బు ఎక్కడిదని ప్రశ్నించగా ఆయన సమాధానం చెప్పలేదు.
సరైన ఆధారాలు చూపకపోవడంతో కారును సీజ్ చేసినట్లు పట్టణ సీఐ కృష్ణ తెలిపారు. మున్సిపల్ ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున రూ.50 వేల కంటే ఎక్కువ డబ్బు పట్టుబడితే ఆధారాలు చూపించాలని, లేకుంటే డబ్బును సీజ్ చేస్తామని సీఐ స్పష్టంచేశారు.
