అన్నం మిగిలిపోతే.. కూర చెయ్యడానికి కుదరకపోతే.. ఆఫీస్ కి టైం అయిపోతుంటే.. హైరాన పడకుండా... సింపుల్ గా ఇలా చేసుకోవచ్చు.. వేడి వేడి అన్నాన్ని .. కొబ్బరి రైస్.. ఇంకా వాము రై స్ తో ఘుమఘుమలాడే ఫుడ్ ను పిల్లల లంచ్ బాక్సుల్లో పెడితే వెరైటీ ఫుడ్ తిని ఎంతో హ్యాపీ ఫీలవుతారు. ఇప్పుడు వాటిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.. . . !
కొబ్బరి రైస్ తయారీకి కావాల్సినవి
- కొబ్బరి పాలు:రెండు కప్పులు
- బియ్యం :ఒక కప్పు
- పచ్చిమిర్చి: ఆరు (సన్నగా తరిగినవి)
- కరివేపాకు :రెండు రెమ్మలు
- యాలకులు :రెండు
- దాల్చిన చెక్క : కొద్దిగా
- లవంగాలు :రెండు
- జీడిపప్పు :రెండు టేబుల్ స్పూన్లు
- పసుపు : పావు టీ స్పూన్
- ఉప్పు: తగినంత
- కొత్తిమీర తరుగు: రెండు టేబుల్ స్పూన్లు
కొబ్బరి రైస్ తయారీ విధానం:
బియ్యం అర గంట ముందు కడిగి పెట్టాలి. ఒక వెడల్పేటైన గిన్నెలో బియ్యం, పచ్చిమిర్చి, కరివేపాకు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, పసుపు, ఉప్పు, కొబ్బరిపాలు చేసి కలిపి స్టవ్ పై పెట్టి మూత పెట్టాలి.
పదినిమిషాలు ఉడికాక ఆ మిశ్రమాన్ని ఒకసారి కలిపి మళీ మూత పెట్టాలి. మరో పదిని మిషాలు ఉడికితే కొబ్బరి అన్నం రెడీ.
కొత్తిమీర, జీడిపప్పు గార్నిష్ చేసి తింటే సూపర్. ఇది వేడిగా తినొచ్చు. చల్లారాక కూడా బాగుంటుంది. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇది బలమైన ఆహారం కూడా..
వాము రైస్ తయారీకి కావలసినవి
- అన్నం: ఒక కప్పు
- వాము: రెండు టేబుల్ స్పూన్లు
- ఎండుమిర్చి: నాలుగు
- వెల్లుల్లి రెబ్బలు: ఆరు (కొద్దిగా దంచినవి).
- కరివేపాకు :రెండు రెమ్మలు
- కొత్తిమీర తరుగు: రెండు టేబుల్ స్పూన్లు
- ఉప్పు :తగినంత
- నూనె: రెండు టేబుల్ స్పూన్లు
వాము రైస్ తయారీ విధానం
బాండీ స్టవ్ పై పెట్టి నూనె వేసి చెయ్యాలి. నూనెలో ముందు ఎండుమిర్చి వెయ్యాలి తర్వాత వెల్లులి రెబ్బలను వేసి వేగించాలి. అవి వేగాక వాము వేసి వేగించాలి.
తర్వాత అన్నం వేసి కలపాలి. రెండు నిమిషాల పాటు వేడిచేసి ఉప్పు వేసి స్టవ్ ఆఫ్ చెయ్యాలి. ఆపై కొత్తిమీర చల్లితే వేడి వేడిగా వామన్నం' రెడీ.
దీన్ని బాలింతలకు, చిన్న పిల్లలకు ఎక్కువగా పెడతారు. పెద్దవాళ్ల జ్వరం వచ్చినప్పుడు తింటే మంచిది. ఇది కడుపులో ఉన్న చెడు అంతా. పోగొడుతుంది. అజీర్తి ఉన్నవాళు రెగ్యులర్ గా తింటే అది తగ్గుముఖం పడుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం వారంలో రెండు రోజులు ఈ రైస్ లను పిల్లలే కాదు పెద్దలు కూడాతింటే బలంతో పాటు ఆరోగ్యం కూడా..
