మహిళల వరల్డ్ కప్ లో భాగంగా తొలి సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ పై సౌతాఫ్రికా బ్యాటింగ్ లో ఆధిపత్యం చూపించింది. బుధవారం (అక్టోబర్ 29) గౌహతి వేదికగా బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇంగ్లీష్ బౌలింగ్ ను అలవోకగా ఆడిస్తూ భారీ స్కోర్ చేశారు. సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ భారీ సెంచరీతో నెక్స్ట్ లెవల్ ఇన్నింగ్స్ ఆడడంతో మొదట బ్యాటింగ్ చేస్తున్న సౌతాఫ్రికా మహిళలు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 319 పరుగులకు చేసింది. లారా వోల్వార్డ్ట్ 169 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచింది. బ్రిట్స్ (45), కప్ (42) రాణించారు.
సెంచరీతో హోరెత్తించిన లారా వోల్వార్డ్ట్:
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికాకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు వోల్వార్డ్ట్, బ్రిట్స్ తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడడం మొదలుపెట్టారు. వీరి బ్యాటింగ్ ధాటికి స్కోర్ అలవోకగా వచ్చింది. తొలి వికెట్ కు వీరిద్దరి జోడీ ఏకంగా 116 పరుగులు జోడించి మంచి స్టార్ట్ ఇచ్చారు. 45 పరుగులు చేసి బ్రిట్స్ ఔట్ కావడంతో సౌతాఫ్రికాతోలి వికెట్ కోల్పోయింది. తర్వాత ఇంగ్లాండ్ బౌలర్లు విజృంభించి స్వల్ప వ్యవధిలో మరో రెండు వికెట్లు పడగొట్టారు. అన్కె బోష్ డకౌట్ కాగా.. సునే లూస్ ఒక్క పరుగుకే పెవిలియన్ కు చేరింది.
►ALSO READ | IND vs AUS 1st T20I: దిగ్గజాలను వెనక్కి నెట్టిన టీమిండియా కెప్టెన్.. సిక్సర్లలో సూర్య వరల్డ్ రికార్డ్
119 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో సీనియర్ ప్లేయర్ కప్ తో కలిసి వోల్వార్డ్ట్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లింది. నాలుగో వికెట్ కు 72 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును పటిష్ట స్థితికి చేర్చారు. అయితే సౌతాఫ్రికా మరోసారి వరుసగా వికెట్లు కోల్పోయినా వోల్వార్డ్ట్ డిర్క్ సన్ తో కలిసి మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఈ క్రమంలో ఈ సౌతాఫ్రికా కెప్టెన్ తన సెంచరీ పూర్తి చేసుకుంది. 48 ఓవర్ వోల్వార్డ్ట్ బ్యాటింగ్ చేయడంతో సౌతాఫ్రికా స్కోర్ 300 పరుగులు దాటింది. ఇంగ్లాండ్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్ నాలుగు వికెట్లు తీసుకుంది. లారా బెల్ రెండు.. బ్రాంట్ ఒక వికెట్ తీసుకుంది.
Laura Wolvaardt’s exceptional knock & a powerful finish help South Africa post a commanding total! 💪🏻💥
— Star Sports (@StarSportsIndia) October 29, 2025
Will England chase this hug total, or will the Proteas seal their spot in the finals? 👀
Catch the LIVE action ➡ https://t.co/H5YqcfOTdm
CWC 25 | Semi Final 1 👉 SA 🆚 ENG… pic.twitter.com/ewaTiQZDkK
