శభాష్ రా బుడ్డోడా.. ట్రాఫిక్ పోలీసులకే చలాన్ వేయించిన స్టూడెంట్.. వీడియో వైరల్

శభాష్ రా బుడ్డోడా.. ట్రాఫిక్ పోలీసులకే చలాన్ వేయించిన స్టూడెంట్.. వీడియో వైరల్

హెల్మెట్​ లేకుండా రోడ్డెక్కామా..చలాన్​..నంబర్​ప్లేట్​ సరిగ్గా లేదా?.. చలాన్​..రాంగ్​ రూట్లో వెళ్లామా చలాన్​.. ఇలా ట్రాఫిక్​ పోలీసోళ్లు ట్రాఫిక్​ రూల్స్​ అతిక్రమించిన ప్రతి బండికి చలాన్లు వేస్తూనే ఉంటారు.. మరి ట్రాఫిక్​ పోలీసులే హెల్మెట్​ లేకుండా బండి నడిపితే.. నంబర్ ప్లేట్ లేని బైక్​ నడిపితే.. వాళ్లకు కూడా రూల్స్​ వర్తిస్తాయా? .. ఎప్పుడైనా అలా జరిగిందా? ఎందుకు జరగలేదు.. ఇది ఈ స్టూడెంట్​ మొండిపట్టు పట్టి ట్రాఫిక్​ పోలీసులకు కూడా చలాన్లు వేయించాడు.. మహారాష్ట్రలోని థానే ఓ టీనేజ్​ స్టూడెంట్.. ట్రాఫిక్​ పోలీసులకు చలాన్లు వేయించిన ఘటన చోటు చేసుకుంది. అలా ఎలా సాధ్యం అనుకుంటున్నారా? 

థానే వెస్ట్​ ప్రాంతానికి  చెందిన ఓ విద్యార్థి.. ఇద్దరు ట్రాఫిక్​ పోలీసులను స్కూటర్​ పై వెళ్తుండగా నంబర్​ ప్లేట్​ సరిగ్గాలేదని వాహనాన్ని వెంబడించి మరీ ఆపాడు. రిజిస్ట్రేషన్​ నంబర్​ కనిపించడం లేదని ట్రాఫిక్​ పోలీసులకు గొడవకు దిగాడు. మరో యువకుని సాయంతో వీడియో తీసి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశాడు. ఆ వీడియో బాగా వైరల్​ అయింది.. నెట్టింట చక్కర్లు కొడుతూ ఆర్టీఏ అధికారికి చేరింది. 

వైరల్ అయిన వీడియోపై థానే పోలీసులు స్పందించారు. వైరల్ వీడియోలో వాదనలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులలో ఒకరు హెల్మెట్ లేకుండా మోటార్ సైకిల్ నడుపుతున్నట్లు కనిపిస్తుంది.  దీని ఫలితంగా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నామని చెప్పారు. గతంలో ఆ యువకుడిపై పోలీసుల చర్య వల్లే అతను ఇలా చేశాడని.. ఆ వీడియో తప్పుదారి పట్టించేదిగా ఉందని చెప్పుకొచ్చారు.