కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిండ్రు.. వికారాబాద్ జిల్లా కాగ్నానదిలో యువకుల సాహసం

కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిండ్రు.. వికారాబాద్ జిల్లా కాగ్నానదిలో యువకుల సాహసం

ఓ వ్యక్తిని ఇద్దరు యువకులు సాహసం చేసి కాపాడారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం వీరిశెట్టిపల్లిలో జరిగింది. భారీ వర్షంతో నదిలో ప్రవాహానికి ఒక యువకుడు కొట్టుకుపోతున్న విషయం గమనించిన గ్రామానికి చెందిన హరి, శ్రావణ్ అనే ఇద్దరు యువకులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా నదిలోకి వెళ్లారు. 

నది మధ్యలో ఉన్న పచ్చికబయళ్లలో ఆ వ్యక్తిని ఆపారు. పరిస్థితిని గమనించిన గ్రామస్థులు వెంటనే తాడు అందించగా.. ఆ తాడు సాయంతో బయటికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి 108 సాయంతో తాండూరు ఆస్పత్రికి తరలించారు. బాధితుడిని యాలాల మండలం అగ్గనూరు గ్రామానికి చెందిన నరసింహులుగా గుర్తించారు. ప్రాణాలను లెక్క చేయకుండా నదిలో దూకి వ్యక్తిని కాపాడిన ఇద్దరు యువకుల సాహసాన్ని గ్రామస్థులు అభినందించారు.

►ALSO READ | తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు.. ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్ పరిస్థితి ఇది..