ఇబ్రహీంపట్నం, వెలుగు: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు రెండో రోజూ నామినేషన్లు భారీగా నమోదయ్యాయి. అత్యధికంగా మొయినాబాద్ లో 83, అత్యల్పంగా శంకర్ పల్లిలో 48, చేవెళ్లలో 62 , ఇబ్రహీంపట్నంలో 77, ఆమన్‌గల్ 49, షాద్‌నగర్‌లో 64 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ నుంచి 76, బీఎస్పీ నుంచి ఒకరు, సీపీఐఎం 4, కాంగ్రెస్ 143, బీఆర్ఎస్ 117, స్వతంత్రులు 33, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు 9 నామినేషన్లు దాఖలు చేశారు.
మేడ్చల్ కలెక్టరేట్: మేడ్చల్ జిల్లాలోని మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో 24 వార్డులకు గాను రెండో రోజు 42 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అలియాబాద్‌లో 20 వార్డులకు గాను 52, ఎల్లంపేట్ లో 24 వార్డులకు గాను 82 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
వికారాబాద్: వికారాబాద్జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో గురువారం మొత్తం 299 నామినేషన్లు దాఖలయ్యాయి. కొడంగల్‌లో 12 వార్డులకుగాను 19 మంది 20 నామినేషన్లు దాఖలు చేశారు. పరిగిలో 18 వార్డులకుగాను 40 మంది 43 నామినేషన్లు, తాండూర్ లో 36 వార్డులకు108 మంది 108 నామినేషన్లు, వికారాబాద్‌లో 34 వార్డులకుగాను 92 మంది 95 నామినేషన్లు దాఖలు చేశారు.
మొత్తంగా బీజేపీ నుంచి 43 మంది, కాంగ్రెస్‌నుంచి 96 మంది, బీఆర్ఎస్ నుంచి 93, ఎఐఎంఐఎం నుంచి 15 మంది, ఇతర గుర్తింపు పొందిన పార్టీల నుంచి నలుగురు, 15 మంది ఇండిపెండెంట్అభ్యర్ధులు తమ నామినేషన్లను దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు.
