ఉపాధి స్కీమ్ నిర్వీర్యానికి కేంద్రం కుట్ర : జాన్వెస్లీ

 ఉపాధి స్కీమ్ నిర్వీర్యానికి కేంద్రం కుట్ర : జాన్వెస్లీ
  • దీనిపై ఫిబ్రవరి15 వరకు నిరసనలు: జాన్​వెస్లీ 

హైదరాబాద్, వెలుగు : ఉపాధి స్కీమ్​నిర్వీర్యానికి కేంద్రంలోని బీజేపీ కుట్రలు చేస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్​వెస్లీ అన్నారు. సీపీఎంతోపాటు వామపక్ష పార్టీల సుదీర్ఘ పోరాటాలతో మహాత్మా గాంధీ పేరిట వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (ఎంజీఎన్ఆర్ఈజీఏ) కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీనిస్థానంలో వీబీ- జీ రామ్ జీ పేరుతో  కొత్త చట్టాన్ని తెస్తూ నిధుల కోత, పనిదినాల కోతకు కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

కూలీల పొట్టగొట్టే  కేంద్ర ప్రభుత్వ చర్యలను సీపీఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు. ఉపాధి స్కీమ్​ను కాపాడుకోవడానికి శనివారం నుంచి ఫిబ్రవరి 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సభలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.