హనుమకొండలో హెయిర్ డైతో టీ పౌడర్..సూపర్ మార్ట్ నిర్వాహకుడిపై కేసు నమోదు

హనుమకొండలో హెయిర్ డైతో టీ పౌడర్..సూపర్ మార్ట్ నిర్వాహకుడిపై కేసు నమోదు
  •     40 కిలోలు స్వాధీనం చేసుకున్న ఫుడ్ ఇన్ స్పెక్టర్లు

శాయంపేట(ఆత్మకూర్​), వెలుగు: జుట్టుకు వేసే కలర్​(హెయిర్​డై)తో తయారు చేసిన నకిలీ టీ పౌడర్​ను వరంగల్​ఫుడ్​ ఇన్ స్పెక్టర్లు కృష్ణమూర్తి, మౌనిక, శాయంపేట సీఐ రంజిత్​రావు పట్టుకున్నారు. హనుమకొండ జిల్లా ఆత్మకూర్​మండలం  గుడెప్పాడ్​లోని ఎంఎం సూపర్​మార్ట్ లో శుక్రవారం ఫుడ్​సేఫ్టీ అధికారులు, పోలీసులు తనఖీలు చేశారు. 

అక్రమంగా నిల్వ చేసిన 40 కిలోల నకిలీ టీ పౌడర్​ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. హెయిర్​డైతో నకిలీ టీ పౌడర్ లో తయారు చేసి అమ్ముతున్నట్టు గుర్తించారు. మార్ట్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. ప్రజలు కల్తీ వస్తువులు, నకిలీ ఆహార పదార్థాలను గుర్తిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ఫుడ్ ఇన్ స్పెక్టర్లు సూచించారు. దామెర ఎస్ఐ కొంక అశోక్, శాయంపేట ఎస్ఐ పరమేశ్వర్,  సిబ్బంది పాల్గొన్నారు.