పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మతం పేరుతో దూషిస్తారా?

పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మతం పేరుతో దూషిస్తారా?
  • బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్యే కౌశిక్‌‌‌‌ రెడ్డిపై ఐపీఎస్‌‌‌‌ అసోసియేషన్ ఆగ్రహం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌ సీపీ గౌష్ ఆలంపై హుజూరాబాద్ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌‌‌‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఐపీఎస్‌‌‌‌ ఆఫీసర్స్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ ఖండించింది. విధి నిర్వహణలో ఉన్న అధికారిని మతం పేరుతో దూషించడం, మత మార్పిడులకు ప్రయత్నిస్తున్నారంటూ అసత్య ఆరోపణలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐపీఎస్ అధికారిపై చేసిన దురుద్దేశపూరిత, నిరాధారమైన ఆరోపణలకు కౌశిక్‌‌‌‌ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌‌‌‌ చేసింది.

ఈ మేరకు ఐపీఎస్‌‌‌‌ అధికారుల అసోసియేషన్‌‌‌‌ అధ్యక్షుడు, డీజీపీ శివధర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లా వీణవంకలో మినీ సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా గురువారం జరిగిన ఘటనపై డీజీపీ అసహనం వ్యక్తం చేశారు. పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఎమ్మెల్యే కౌశిక్‌‌‌‌రెడ్డి వ్యాఖ్యలున్నాయని మండిపడ్డారు. ఇది సివిల్ సర్వెంట్ల నైతిక స్థైర్యం, గౌరవంపై జరిగిన తీవ్రమైన దాడిగా పరిగణిస్తున్నామన్నారు.