కాంగ్రెస్-, బీఆర్ఎస్ తోడు దొంగలు : రాంచందర్ రావు

కాంగ్రెస్-, బీఆర్ఎస్ తోడు దొంగలు : రాంచందర్ రావు
  • నువ్వు నన్ను రక్షించు, నేను నిన్ను రక్షిస్తా.. అంటూ ఒప్పందాలు: రాంచందర్ రావు

జగిత్యాల, వెలుగు: ‘నువ్వు నన్ను రక్షించు, నేను నిన్ను రక్షిస్తా..’అన్న ఒప్పందం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఉందని బీజేపీ స్టేట్‌‌‌‌ చీఫ్‌‌‌‌ రాంచందర్ రావు అన్నారు. శుక్రవారం జగిత్యాలలో బీజేపీ విజయ శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాంచందర్ రావుతో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త కొండా లక్ష్మణ్ దంపతులతో పాటు పలువురు నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ, అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు.  ఎంపీ అరవింద్ మాట్లాడుతూ, కేసీఆర్‌‌‌‌ను 100 రోజుల్లో జైలుకు పంపిస్తానన్న సీఎం రేవంత్.. మాటలు గాలిలో కలిసిపోయాయని ఎద్దేవా చేశారు.